కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్త కోసం అంతపనీ చేస్తుందా ?
Send us your feedback to audioarticles@vaarta.com
దాదాపు దశాబ్దానికి పైగా క్రేజ్ అలాగే కొనసాగించడం కొందరు హీరోయిన్లకు మాత్రమే సాధ్యం. ఆ జాబితాలో కాజల్ అగర్వాల్ కూడా ఉంటుంది. గత పదేళ్లుగా కాజల్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గానే వెలుగొందుతోంది. గత ఏడాది కాజల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
Also Read: తుఫానులో నటి హాట్ ఫోటోషూట్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
సహజంగానే హీరోయిన్లు పెళ్లి తర్వాత వెండితెరకు దూరమవుతుంటారు. ఇదే ప్రశ్న కాజల్ కు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. ఈ ప్రశ్నకు కాజల్ ఇచ్చిన సమాధానం ఫ్యాన్స్ కు షాకిచ్చే విధంగా ఉంది. కెరీర్ పరంగా నాకు కుటుంబ సభ్యులతో పాటు గౌతమ్ కూడా ఎంతో సహకారం అందించాడు. వారి ప్రోత్సాహం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను.
నేను సినిమాల్లో కొనసాగితే అది నా భర్త అనుమతితోనే. గౌతమ్ వద్దు అన్న రోజున తప్పకుండా సినిమాల్లో నటించడం మానేస్తా అని కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాజల్ భర్త బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నారు.
కాజల్ కు ఇప్పటికీ అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం కాజల్ మెగాస్టర్ చిరంజీవి సరసన ఆచార్య చిత్రంలో నటిస్తోంది. అలాగే కమల్ హాసన్ ఇండియన్ 2 లో కూడా కాజలే హీరోయిన్. కాజల్ దాదాపుగా సౌత్ లో స్టార్ హీరోలందరితో కలసి నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com