కాజ‌ల్‌కి ఎలాంటి రిజ‌ల్ట్ వ‌స్తుందో?

  • IndiaGlitz, [Friday,April 01 2016]

ఇంత‌కు ముందు వ‌ర‌కు త‌మ‌న్నా, శ్రుతి హాస‌న్‌ల‌కే మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఓ అంశం.. ఇప్పుడు కాజ‌ల్‌కి కూడా యాడ్ అవుతోంది. అదేమిటంటే.. మెగా ఫ్యామిలీకి చెందిన బాబాయ్ అబ్బాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తోనూ, రామ్‌చ‌ర‌ణ్‌తోనూ రొమాన్స్ చేయ‌డం. రామ్‌చ‌ర‌ణ్‌తో ర‌చ్చ‌లో న‌టించాక‌.. ప‌వ‌న్‌తో కెమెరామెన్‌గంగ‌తో రాంబాబు చేసింది త‌మ‌న్నా. ఇక శ్రుతి హాస‌న్ ఏమో ప‌వ‌న్‌తో గ‌బ్బ‌ర్‌సింగ్ చేశాక‌.. చ‌ర‌ణ్‌తో ఎవ‌డు చేసింది.

ఇలా బాబాయ్ అబ్బాయ్ తో జ‌ట్టుక‌ట్టిన హీరోయిన్ల జాబితాలో ఇప్పుడు కాజ‌ల్ చేరిన సంగ‌తి తెలిసిందే. మ‌గ‌ధీర‌, నాయ‌క్‌, గోవిందుడు అంద‌రి వాడేలే.. ఇలా చెర్రీ హీరోగా న‌టించిన మూడు చిత్రాల్లో హీరోయిన్గా న‌టించిన కాజ‌ల్‌కి.. బాగా ఆల‌స్యంగానే ప‌వ‌న్‌తో ఆడిపాడే అవ‌కాశం వ‌చ్చింది స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ కోసం.

ప‌వ‌న్‌తోనూ, చ‌ర‌ణ్‌తోనూ శ్రుతి హాస‌న్ కి విజ‌యాలుంటే.. త‌మ‌న్నాకి మాత్రం వారిలో ఒక‌రి కాంబినేష‌న్‌లో మాత్ర‌మే హిట్ కొట్టిన వైనం ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే చ‌ర‌ణ్‌తో విజ‌యాలందుకున్న కాజ‌ల్‌కి.. ప‌వ‌న్‌తో ఎలాంటి రిజ‌ల్ట్ అందుతుందో చూడాలి. ప‌వ‌న్‌తోనూ స‌క్సెస్ పొందితే మాత్రం శ్రుతి లా బాబాయ్ అబ్బాయ్ లిద్ద‌రికీ అచ్చొచ్చిన హీరోయిన్‌గా కాజ‌ల్‌కీ ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కుతుంది. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో?

More News

త్రివిక్ర‌మ్ ముచ్చ‌ట తీరుతుందా?

మాట‌ల ర‌చ‌యిత‌గానూ, ద‌ర్శ‌కుడుగానూ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌కి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌త్యేక  స్థానం ఉంది. అందుకే ఆయ‌న చెంత‌కు విజ‌యాలు.. అవ‌లీల‌గా వ‌చ్చి చేరుతుంటాయి.

త్రిష బాట‌లో త‌మ‌న్నా

ప‌దేళ్ల‌కి పైగా హీరోయిన్లుగా రాణిస్తున్న వైనం అందాల తార‌లు త్రిష‌, త‌మ‌న్నా సొంతం. త‌మ‌న్నా కంటే ముందు త్రిష కెరీర్ ని ప్రారంభించినా.. ఓ విష‌యంలో మాత్రం ఈ ఇద్ద‌రు కాస్త అటుఇటుగానే  అడుగులు వేస్తున్నారు.

రాహుల్ రవీంద్రన్ నూతన చిత్రం ప్రారంభం

అందాల రాక్షసి చిత్రం తో మంచి పేరు సంపాదించుకుని, యంగ్ జనరేషన్ సినిమా ప్రేమికులకు దగ్గర అయిన యూత్ఫుల్ హీరో రాహుల్ రవీంద్రన్. వైవిద్యభరితమైన కథ ల తో మంచి సక్సెస్ ను సంపాదించుకున్న రాహుల్ త్వరలో ఒక కొత్త చిత్రం లో నటించబోతున్నాడు.

బాహుబలి-2 లో దీపికా పడుకునే...

తెలుగు సినిమా బాహుబలి ఎంతటి సంచలన విజయం సాధించిందో...ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.

ప‌వ‌న్ తో విభేదించిన డైరెక్ట‌ర్ బాబీ

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా బాబీ తెర‌కెక్కించిన చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే....ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో డైరెక్ట‌ర్ బాబీ ఓ విష‌యంలో విభేదించాడ‌ట‌.