కాజల్‌కు అరుదైన గౌరవం.. గోల్డెన్ వీసా ఇచ్చిన యూఏఈ

  • IndiaGlitz, [Thursday,February 03 2022]

సినీ నటి కాజల్‌కు అరుదైన గౌరవం దక్కింది. అత్యంత అరుదుగా, కొందరు ప్రముఖులకు మాత్రమే ఇచ్చే గోల్డెన్ వీసాను యూఏఈ ప్రభుత్వం కాజల్ అగర్వాల్‌కు అందజేసింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకోవడం సంతోషంగా వుందన్నారు. తమలాంటి కళాకారులకు యూఏఈ తొలి నాళ్ల నుంచి ఎనలేని ప్రోత్సాహం అందిస్తోందని కాజల్ ప్రశంసించింది. ఈ సందర్భంగా మహ్మద్ షానిద్, సురేశ్ పున్నస్సెరిల్, నరేశ్ కృష్ణలకు కాజల్ కృతజ్ఞతలు తెలిపారు.

మెగా కోడలు, అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ ఉపాసన కామినేనికి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా అందజేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గోల్డెన్‌ వీసా పొందడం సంతోషంగా ఉందన్నారు . తాను అన్ని దేశాల పట్ల అపారమైన గౌరవం, ప్రేమ కలిగిన భారతీయురాలిని అంటూ తన ఆనందాన్ని ట్విట్టర్‌లో తెలిపారు ఉపాసన. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, మలయాళ నటుడు మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, నటి త్రిష, గాయని చిత్ర ఇలా చాలా మంది గోల్డెన్ వీసా అందుకున్నారు.

ఈ గోల్డెన్ వీసాను యూఏఈ ప్రభుత్వం 2019 నుంచి జారీ చేస్తోంది. అయితే ఈ వీసాను అందరికీ ఇవ్వరు. సాహిత్యం, విద్య, కళలు, పరిశ్రమలకు సంబంధించిన వారికి మాత్రమే ఈ వీసా అందజేస్తారు. దీని సాయంతో దుబాయ్లో ఎటువంటి ఆంక్షలు లేకుండా నివసించవచ్చు. స్థానికులకు ఎలాంటి హక్కులు ఉంటాయో అలాంటి హక్కులు ఈ గోల్డెన్ వీసా పొందిన వారికి కూడా ఉంటాయి. అంతేకాదు ఇక్కడ వ్యాపారం చేసుకొవడానికి కూడా వారికి అనుమతి ఉంటుంది. 5 నుంచి 10 ఏళ్ల వరకు దీని కాలపరిమితి ఉంటుంది. అనంతరం ఆటోమోటిక్గా రెన్యూవల్ అవుతుంది.

More News

బ్రేకింగ్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు

యూపీ ఎన్నికల ప్రచారంలో వున్న హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆయనకెలాంటి ప్రమాదం జరగలేదు. ఒవైసీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ కారు మాత్రం పంక్చరైంది.

పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అర్జున్.. ఫోటోను తడుముతూ బన్నీ భావోద్వేగం

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం నుంచి ఇంకా చిత్ర పరిశ్రమ, అభిమానులు, సన్నిహితులు కోలుకోలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఆయన ప్రస్తావన వస్తూనే వుంది.

కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న 'సెబాస్టియన్' పి.సి.524

రాజావారు రాణి గారు వంటి సూపర్ హిట్ సినిమాతో హీరోగా పరిచయమై "యస్.ఆర్. కళ్యాణమండపం" సినిమా తో బ్లాక్ బస్టర్ సాదించి ప్రేక్షకులలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు కిరణ్ అబ్బవరం. మంచి కథలను

సినిమా ప్రారంభమైన రెండు నిమిషాలకే 'సెహరి' ప్రపంచంలోకి వెళ్తారు - దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సెహరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక.

పోలీసుల ఆంక్షలు ఛేదించి.. భద్రతా వలయాన్ని దాటుకుని, బెజవాడ చేరుకున్న ఉద్యోగులు

పీఆర్సీ విషయంగా ఏపీ ప్రభుత్వానికి- ఉద్యోగ సంఘాలకు మధ్య వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. పలు దఫాలుగా వారిని చర్చలకు ఆహ్వానించినా.. ఉద్యోగులు మాత్రం హాజరుకాలేదు.