డేట్‌కు రమ్మంటే ఏంటిది.. ఆల్ ది బెస్ట్.. ప్రదీప్..? : కాజల్
Send us your feedback to audioarticles@vaarta.com
యాంకర్ ప్రదీప్ హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే రొమాంటిక్ కామెడీ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. బుల్లితెర మీద సత్తా చాటిన ప్రదీప్.. వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తహతహలాడుతున్నాడు. ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ పాటకు ఇప్పటివరకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకట్రెండు కాదు.. ఏకంగా మూడు కోట్ల మంది పాటను విన్నారు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు ప్రదీప్ పెద్ద ఫ్యాన్ అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాజల్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది.
అసలేం జరిగింది!?
ప్రశ్న : ఒకవేళ కాజలే స్వయంగా డేటింగ్‌కి రమ్మంటే ఏం చేస్తావ్..?
ప్రదీప్ : ‘ముందైతే షాక్‌తో కళ్లు తిరిగిపడిపోతాను. ఆ తర్వాత నన్ను నేను గిచ్చుకుని ఇదంతా నిజం కాదు అని అనుకుంటా. ఒకవేళ నిజంగానే కాజల్ డేట్‌కి వెళ్దాం అని అడిగితే.. నో మేడమ్.. నాతో జోకులు వేయకండి అంటాను’ అన్నాడు. అయితే దీనికి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుతున్న కాజల్ రియాక్ట్ అయ్యింది.
కాజల్ రియాక్షన్: ‘ప్రదీప్.. ఇలాంటి టఫ్ క్వశ్చన్‌కు కాస్త క్రియేటివ్ ఆన్సర్ ఆలోచించు.. నీ సినిమాకు ఆల్ ది బెస్ట్’ అని రిప్లై ఇచ్చింది. కాగా ఈ వ్యవహారంపై నెటిజన్లు చిత్ర విచిత్రాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరైతే ఆయనతో డేట్ ఏంట్రా బాబూ అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com