కాజ‌ల్ మ‌రోసారి అదే పేరుతో..

  • IndiaGlitz, [Wednesday,March 21 2018]

నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం 'ఎం.ఎల్.ఎ'. మంచి లక్షణాలున్న అబ్బాయ్ అన్నది ట్యాగ్ లైన్. నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ ఈ సినిమాను తెరకెక్కించారు. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

మెలోడీ బ్ర‌హ్మ‌ మణిశర్మ స్వరపరచిన పాటలు.. ఇప్ప‌టికే శ్రోతలను అలరిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ ఆల్బమ్‌లో హే ఇందు అనే పాట వింటుంటే ఈ సినిమాలో  కాజల్ పేరు ఇందు అని అర్ధమవుతోంది. గతంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'మగధీర' (2009)లో కూడా కాజల్ పేరు ఇందు కావడం విశేషం.

ఆ సినిమాలో నాకోసం నువ్వు జుట్టుపీక్కుంటే అనే పాటలో హే ఇందు.. అనే మాట పాట మధ్యలో వస్తుంది. ఇప్పుడు 'ఎం.ఎల్.ఎ' సినిమా కోసం హే ఇందు అనేది పల్లవిలోనే వచ్చేట్టు పాట‌ రాశారు గేయ రచయిత. మరి 'మగధీర' పాత్ర పేరుని, పాటలో పేరుని మ‌రోసారి రిపీట్ చేస్తున్న‌ కాజల్.. ఈ సారి కూడా హిట్ అందుకుంటుందేమో చూడాలి. మార్చి 23న ఈ సినిమా విడుద‌ల కానుంది.

More News

తొమ్మిది రోజుల గ్యాప్‌లో.. విజ‌య్ డ‌బుల్ ధ‌మాకా

'అర్జున్ రెడ్డి'తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్‌గా ఎదిగారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారారు ఈ యూత్ స్టార్.

రామ్‌తో మ‌రోసారి కాజ‌ల్‌?

‘పి ఎస్ వి గరుడవేగ 126.18ఎం’ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు.

'సవ్యసాచి' పాయింట్ అదేన‌ట‌

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'సవ్యసాచి'. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా న‌టిస్తోంది.

 ప్రభుదేవా గులేబకావళి గీతావిష్కరణ

ప్రభుదేవా, హన్సిక హీరో హీరోయిన్లుగా  నటించిన తమిళ  చిత్రం గులేబకావళి. కళ్యాణ్ దర్శకత్వం వహించారు. రేవతి ప్రధాన పాత్రను పోషించారు.

ఐక్యరాజ్య సమితి నుంచి అరుదైన గౌరవం అందుకొన్న నరేష్ !!

ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ డిప్లమాటిక్ రిలేషన్స్, హ్యూమన్ రైట్స్ & పీస్, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు.