కాజల్ మరోసారి అదే పేరుతో..
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం 'ఎం.ఎల్.ఎ'. "మంచి లక్షణాలున్న అబ్బాయ్" అన్నది ట్యాగ్ లైన్. నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ ఈ సినిమాను తెరకెక్కించారు. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరపరచిన పాటలు.. ఇప్పటికే శ్రోతలను అలరిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ ఆల్బమ్‌లో "హే ఇందు" అనే పాట వింటుంటే ఈ సినిమాలో కాజల్ పేరు "ఇందు" అని అర్ధమవుతోంది. గతంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'మగధీర' (2009)లో కూడా కాజల్ పేరు ఇందు కావడం విశేషం.
ఆ సినిమాలో "నాకోసం నువ్వు జుట్టుపీక్కుంటే" అనే పాటలో "హే ఇందు".. అనే మాట పాట మధ్యలో వస్తుంది. ఇప్పుడు 'ఎం.ఎల్.ఎ' సినిమా కోసం "హే ఇందు" అనేది పల్లవిలోనే వచ్చేట్టు పాట రాశారు గేయ రచయిత. మరి 'మగధీర' పాత్ర పేరుని, పాటలో పేరుని మరోసారి రిపీట్ చేస్తున్న కాజల్.. ఈ సారి కూడా హిట్ అందుకుంటుందేమో చూడాలి. మార్చి 23న ఈ సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout