కాజల్ కి హ్యాట్రిక్ మిస్ అయ్యింది..
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాది హీరోయిన్ల విషయంలో 2017 ఏ హీరోయిన్‌కి బాగా కలిసొస్తోంది.. అంటే దానికి సమాధానం కాజల్ అగర్వాల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ ఏడాది ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెం.150తో ఓ బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్న కాజల్.. రెండు వారాల క్రితం రానాతో కలిసి నటించిన నేనే రాజు నేనే మంత్రితో మరో విజయాన్ని అందుకుంది.
ఇక ఇవాళే విడుదలైన వివేకం తమిళ వెర్షన్‌కు ఆల్రెడీ హిట్ టాక్ వచ్చింది తమిళనాట. అంతేకాకుండా అజిత్, కాజల్ కాంబినేషన్ బాగుందంటూ ప్రశంసలు కూడా వస్తున్నాయి. అయితే తెలుగు వివేకం వెర్షన్ మాత్రం ప్లాప్ టాక్ మూట గట్టుకుంది. మొత్తానికి.. కాజల్ ఈ ఏడాదిలో హ్యాట్రిక్ కొట్టాలనే కోరిక నేరవేరలేదనే చెప్పాలి. ఏదేమైనా.. హీరోయిన్గా పదేళ్ల కెరీర్‌ని పూర్తిచేసుకోవడమే కాకుండా 50 సినిమాల మైలురాయికి చేరుకున్న కాజల్‌కి ఈ ఏడాది సినిమాల పరంగా బాగానే కలిసొచ్చిందనాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com