'అ!' లో కాజల్ పాత్రే కీలకమట
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్తగా వచ్చే నటీనటులకి పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి విజయాలు అవసరం. ఆ విజయాలు వారిని ఒక స్థాయికి తీసుకుని వెళతాయి. ఒకసారి ఆ స్థాయి చేరుకున్నాక.. విజయాల కంటే వారి అనుభవంతో వచ్చే పాత్రలకే పెద్దపీట వేస్తారు నటీనటులు. ఇప్పుడు ఆ దశకి చేరుకున్న నటీమణులలో కాజల్ అగర్వాల్ ఒకరు. త్వరలో ఈ ముద్దుగుమ్మ ఇటువంటి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఆ చిత్రమే అ!`. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో నిత్యా మీనన్, రెజీనా, అవసరాల శ్రీనివాస్, ఈషా రెబ్బా, ప్రియదర్శి, మురళి శర్మ తదితరులు నటించారు. ఇందులో కాజల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలిసింది.
టీజర్, ట్రైలర్‌లో.. ఇప్పటి వరకు ఒక పాత్రతో మరో పాత్రకి ఉన్న సంబంధం ఏమిటన్నది చెప్పకుండా జాగ్రత్త పడింది చిత్ర యూనిట్. అయితే ఈ పాత్రలన్నిటితోనూ కాజల్‌కు లింక్ ఉంటుందని.. అదేమిటన్నది సినిమాకి కీలకమని తెలిసింది. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే...నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బాలపై చిత్రీకరణ జరిగిన తర్వాత కాజల్ పాత్రను చిత్రీకరించారు. కేవలం ఐదు రోజుల్లో తన పాత్రను పూర్తి చేసిందంట కాజల్. అలాగే... మేకప్ లేకుండా నటించిందని సమాచారం. ఇక ట్రైలర్ లో చూపించినట్టు “ఈ రోజు నేనొక మాస్ మర్డర్ చేయబోతున్నాను” అనే డైలాగ్ కాజల్ పలికిన మాటల్లా ఉన్నాయి. అయితే ఆ మాస్ మర్డర్ చేయడానికి కారణం ఏమిటి? అనేది తెలియాలంటే శుక్రవారం వరకు వేచి ఉండాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com