'అ!' లో కాజల్ పాత్రే కీలకమట

  • IndiaGlitz, [Thursday,February 15 2018]

కొత్తగా వచ్చే నటీనటులకి పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి విజయాలు అవసరం. ఆ విజయాలు వారిని ఒక స్థాయికి తీసుకుని వెళతాయి. ఒకసారి ఆ స్థాయి చేరుకున్నాక.. విజయాల కంటే వారి అనుభవంతో వచ్చే పాత్రలకే పెద్దపీట వేస్తారు నటీనటులు. ఇప్పుడు ఆ దశకి చేరుకున్న నటీమణులలో కాజల్ అగర్వాల్ ఒకరు. త్వ‌ర‌లో ఈ ముద్దుగుమ్మ‌ ఇటువంటి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఆ చిత్ర‌మే అ!'. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో నిత్యా మీనన్, రెజీనా, అవసరాల శ్రీనివాస్, ఈషా రెబ్బా, ప్రియదర్శి, మురళి శర్మ త‌దిత‌రులు న‌టించారు. ఇందులో కాజ‌ల్‌ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలిసింది.

టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లో.. ఇప్పటి వరకు ఒక పాత్రతో మరో పాత్రకి ఉన్న‌ సంబంధం ఏమిటన్నది చెప్పకుండా జాగ్రత్త పడింది చిత్ర యూనిట్. అయితే ఈ పాత్రలన్నిటితోనూ కాజల్‌కు లింక్ ఉంటుంద‌ని.. అదేమిట‌న్న‌ది సినిమాకి కీల‌క‌మ‌ని తెలిసింది. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే...నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బాలపై చిత్రీకరణ జరిగిన తర్వాత కాజల్ పాత్రను చిత్రీకరించారు. కేవలం ఐదు రోజుల్లో తన పాత్రను పూర్తి చేసిందంట కాజల్. అలాగే... మేకప్ లేకుండా నటించిందని సమాచారం. ఇక ట్రైలర్ లో చూపించినట్టు “ఈ రోజు నేనొక మాస్ మర్డర్ చేయబోతున్నాను” అనే డైలాగ్ కాజల్ పలికిన మాటల్లా ఉన్నాయి. అయితే ఆ మాస్ మర్డర్ చేయడానికి కారణం ఏమిటి? అనేది తెలియాలంటే శుక్ర‌వారం వరకు వేచి ఉండాల్సిందే.

More News

నాగ్ , నాని మూవీలో కన్నడ నటి

కింగ్ నాగార్జున,నేచురల్ స్టార్ నాని కథానాయకులుగా ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతోంది.

'సైరా నరసింహారెడ్డి' కొత్త షెడ్యూల్ అప్ డేట్

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

'కొత్తగా ఉన్నాడు' ఆడియో వేడుక

తమిళ సినిమాలతో బిజీగా ఉన్న అందాల కథానాయకుడు ఆకాష్ తాజాగా తెలుగులో నటించిన చిత్రం `కొత్తగా ఉన్నాడు'.

సైకలాజికల్ లవ్ స్టోరీగా మసక్కలి

కొన్ని కథలు విని నమ్ముతాం..కొన్ని కథలు చూసి నమ్ముతాం..మరికొన్ని కథలు చూసినా నమ్మలేని విధంగా ఉంటాయి..

'47 డేస్' ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేసిన పూరి

ప్రదీప్ మద్దాలిని దర్శకుడిగా పరిచయం చేస్తూ టైటిల్ కార్డ్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న సినిమా '47 డేస్'..  "ది మిస్టరీ అన్ ఫోల్డ్స్" అనేది ట్యాగ్ లైన్..సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ నుండి "క్యా కరూన్" అని సాగే మొదటి పాటను వాలెంటైన్స్ డే సందర్భంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు..రఘు కుంచె స్వరపరచి