నాగ్ చిత్రంలో కాజల్...
Send us your feedback to audioarticles@vaarta.com
కాజల్ అగర్వాల్ ఇప్పుడు నాగార్జున చిత్రంలో నటించనుంది. నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `రాజుగారి గది2`. ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన మంచి విజయం సాధించిన `రాజుగారిగది` చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతుంది. ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ పాత్ర కోసం కాజల్ 10రోజుల కాల్ష్‌షీట్‌ను కేటాయించిందని సమాచారం. ఇందులో సమంత దెయ్యం పాత్రలో నటిస్తుందట. ఈ చిత్రంలో ఎదుటివారి మనస్తత్వాలను చదివే మానసిక నిపుణుడి పాత్రలో నాగార్జున నటిస్తాడట. అల్రెడి విడుదలైన నాగార్జున లుక్స్‌కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తుంది. అవయవదానంపై రాజుగారిగది చిత్రాన్ని తెరకెక్కించిన ఓంకార్ ఈ చిత్రంలో ఎలాంటి మెసేజ్ ఇస్తాడోమరి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments