స్టార్ క్రికెటర్‌తో లవ్‌లో కాజల్ అగర్వాల్!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో బిజీబిజీగా ఉన్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ప్రేమలో మునిగి తేలుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీరెవర్నైనా లవ్ చేస్తున్నారా..? మీ లవర్ ఎవరు..? అనే ప్రశ్నలు ఎదురవ్వగా ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అవును నేను ప్రేమలో ఉన్నాను.. కాకపోతే అది వన్‌సైడ్ లవ్ మాత్రమేనని చెప్పుకొచ్చింది. క్రికెటర్ రోహిత్ శర్మ అంటే తనకు పిచ్చిప్రేమ అంటోంది ఈ భామ. వాస్తవానికి నాకు క్రికెట్ అంటే బాగా ఇష్టం. రోహిత్ శర్మ ఆడే బ్యాటింగ్ అంటే మరీ ఇష్టం.. ఆయన బ్యాటింగ్ స్టైల్, ఫీల్డింగ్.. ముఖ్యంగా ఆయన ఎనర్జీ అంటే ఎనలేని ఇష్టమని.. అందుకే రోహిత్ శర్మతో లవ్‌లో పడిపోయానని కాజల్ చెప్పుకొచ్చింది.
ఒకానొకప్పుడు తనది వన్‌సైడ్ లవ్ అయినప్పటికీ.. అది వర్కవుట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు టూ సైడ్స్ లవ్ బాగానే సాగుతోందని స్వయానా కాజలే చెప్పడం విశేషం. అయితే ఇప్పటి వరకూ కాజల్ లవ్ గురించి పలుమార్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పకపోయినప్పటికీ ఎట్టకేలకు తన మనసులో మాట.. గుండెల్లో దాచుకున్న లవ్ గురించి చెప్పడంతో ఇటు కాజల్ అభిమానులు.. అటు రోహిత్ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. అయితే ఈ లవ్ ప్రపోజల్ ఎప్పుడు ఉంటుందో..? ఈ వ్యవహారం పెళ్లిదాకా వెళ్తుందో లేదో..? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
రోహిత్‌కు పెళ్లి అయిపోయిందిగా..!
క్రికెటర్ రోహిత్ శర్మకు 2017 డిసెంబర్ 13న రితికను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ యానివర్సీ కూడా చేసుకున్నాడు. అయితే ఈ టైమ్‌లో లవ్ వ్యవహారం అంటే ఎలా ఉంటుందో పరిస్థితి. ఇదిలా ఉంటే.. 2017లో సరిగ్గా పెళ్లి రోజునే 13 ఫోర్లు, 12 సిక్సర్లతో 208 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచిన రోహిత్.. తన భార్య రితికకు ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చిన విషయం విదితమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout