కన్నడ చిత్రంలో కాజల్
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల చందమామ కాజల్ అగర్వాల్ మంచి బ్రేక్ కోసం వేచి చూస్తుంది. తెలుగులో ఆమె నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అ!’ సినిమాల తర్వాత అనుకున్న రేంజ్‌లో హిట్‌ను సాధించలేదు. ప్రస్తుతం ఈమె నటించిన పారిస్ పారిస్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్ చిత్రం ‘ముంబై సాగా’తో పాటు తెలుగు, ఇంగ్లీష్‌లో రూపొందుతోన్న ‘మోసగాళ్ళు’, ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ‘ఇండియన్ 2’ చిత్రంలో నటిస్తుంది.
మూడు డిఫరెంట్ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు వీటిలో ఏదో ఒకటి హిట్ కాకపోతుందా? అనే ధీమాతో ఉంది. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ బ్యూటీ ఓ భారీ కన్నడ చిత్రంలో నటించనుంది. ఇప్పటి వరకు ఈమె కన్నడ సినిమాల్లో నటించలేదు. తొలిసారి కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్రతో చంద్రు తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కబ్జా’. కేవలం కన్నడంలోనే ప్యాన్ ఇండియా చిత్రంగా దీన్ని తెరకెక్కించాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఈ సినిమాలో కాజల నటిస్తే ఆమె ఖాతాలో మరో భారీ చిత్రం యాడ అయినట్లేనని సినీ వర్గాల సమాచారం.
హీరోయిన్‌గా దశాబ్దంపైగానే రాణిస్తూ ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్‌తో పోటీ పడుతూ కుర్ర హీరోలతో కాజల్ జోడి కడుతుంది. అలాగే సీనియర్ హీరోలతోనూ ఆడిపాడుతుంది. ఇప్పటికే ఆరవై పైగా సినిమాల్లో నటించిన కాజల్ చేస్తున్న, చేయబోతున్న సినిమాలపై భారీ ఆశలనే పెట్టుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments