పసుపు వేడుకలో మెరిసిపోయిన కాజల్
- IndiaGlitz, [Thursday,October 29 2020]
స్టార్ హీరోయిన్ కాజల్ పెళ్లి మరికొన్ని గంటల్లో జరగనుంది. ఇప్పటికే వివాహ వేడుకలు అంగరంగ ప్రారంభమయ్యాయి. కాజల్ వివాహం ఈ నెల 30న జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేడు పసుపు వేడుక జరిగింది. ఈ పసుపు వేడుకలో పసుపు రంగు దుస్తుల్లో చాలా అందంగా కాజల్ కనిపిస్తోంది. ఎన్నో సినిమాల్లో పెళ్లి వేడుకల్లో కాజల్ కనిపించినప్పటికీ ఇప్పుడు నిజ జీవితంలో జరుగుతున్న పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తోంది. పసుపు వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆభరణాలు ధరించి కాజల్ మెరిసిపోయింది.
తన స్నేహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లును కాజల్ వివాహమాడబోతోంది. ఇప్పటికే బ్యాచులర్ పార్టీ సహా పలు పార్టీలతో తన వివాహానికి ముందు పలు పార్టీలతో సందడి చేసిన కాజల్ మరికొన్ని గంటల్లోనే పెళ్లిపీటలెక్కబోతోంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె డ్యాన్స్ చేసింది. కాజల్ సోదరి నిషా అగర్వాల్ తమ ఇంట్లో పని చేసే వారికి బహుమతులను అందజేసింది. వీటన్నింటికీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.