మరో వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పిన అందాల చందమామ
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత నటనకు దూరం కాలేదు. మరో అడుగు ముందుకేసి సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లోనూ తాను నటించడానికి సిద్ధం అనేస్తుంది మరి. ఇప్పటికే.. తమిళ వెబ్ సిరీస్ లైవ్ స్ట్రీమింగ్‌లో నటించింది. ఇప్పుడు మరో వెబ్ సిరీస్‌లోనూ నటించడానికి ఓకే చెప్పిసినట్లు వార్తలు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇంతకీ కాజల్ ఏ వెబ్ సిరీస్‌లో నటించనుంది. ఎవరి దర్శకత్వంలో అనే వివరాల్లోకి వెళితే..
తెలుగు ఓటీటీ మాధ్యమమైన ఆహా పలువురు దర్శకులతో వెబ్ సిరీస్‌లను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా డైరెక్టర్ మారుతితో ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించనుంది. అల్లు అరవింద్‌తో ఉన్న అనుబంధం కారణంగా వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయడానికి ఓకే చెప్పిన మారుతి, కథను సిద్ధం చేసేశాడట. అయితే ఇప్పుడు గోపీచంద్‌తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కించనున్నాడు మారుతి. ఈ సినిమా పూర్తయిన తర్వాతే వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తాడట. ఇందులో కాజల్ అగర్వాల్‌దే ప్రధాన పాత్ర. త్రీ రోజస్ పేరుతో వెబ్ సిరీస్ రూపొందనుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’లో నటించిన కాజల్.. కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’, తమిళంలో ఓ రెండు సినిమాలు చేస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com