కాజల్.. చిననాటి కల
Send us your feedback to audioarticles@vaarta.com
గతేడాది.. కాజల్ అగర్వాల్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. చిరంజీవి రీ-ఎంట్రీ ఫిలిం 'ఖైదీ నంబర్ 150'లో కథానాయికగా సందడి చేసిన కాజల్...ఎప్పటినుంచో విజయం కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రానా సరసన 'నేనే రాజు నేనే మంత్రి'లో హీరోయిన్‌గా నటించింది. ఈ రెండు చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇక తమిళంలో 'వివేగం' మూవీ కోసం స్టార్ హీరో అజిత్ సరసన ఆడిపాడింది.
ఇక మరో స్టార్ విజయ్ మెర్సల్` చిత్రంలో కూడా ఒక నాయికగా నటించింది. ఇలా గత సంవత్సరాన్ని విజయవంతంగా ముగించిన కాజల్... ఈ ఏడాది కూడా వరుసగా మూడు ఆసక్తికరమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో ఒకటి తమిళ చిత్రం 'పారిస్ పారిస్' (బాలీవుడ్ 'క్వీన్'కి ఇది రీమేక్) కాగా.. మరొకటి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 'ఎం.ఎల్.ఎ.'. ఇక నాని నిర్మాతగా మారి నిర్మించిన 'అ' సినిమాలో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తోంది కాజల్.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఒక తెలుగు పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిననాటి కల గురించి మీడియాతో పంచుకుంది కాజల్. తనకి చిన్నతనంలో కల్పనా చావ్లా మాదిరిగా వ్యోమగామిగా మారి అంతరిక్షాన్ని పరిశోధించాలని కోరిక ఉండేదని వెల్లడించింది. కాని అనుకోకుండా సినిమాల వైపు వచ్చానని.. విజయం సాధించానని చెప్పుకొచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com