'ఆచార్య‌'పై కాజ‌ల్ క్లారిటీ..!

  • IndiaGlitz, [Saturday,May 02 2020]

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య‌. కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు. నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌లు. షూటింగ్ ద‌శ‌లోఉన్న స‌మయంలో క‌రోనా రావ‌డం..ఫ‌లితంగా షూటింగ్ ఆగ‌డం జ‌రిగిపోయాయి. అలాగే ఈ సినిమాలో ముందుగా కోలీవుడ్ డ‌స్కీ బ్యూటీ త్రిష‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఆమె క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ అంటూ కార‌ణాన్ని చెప్పి ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంది. దీంతో నిర్మాత‌లు కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను ఫైన‌ల్ చేశారు. అయితే క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌క పోవ‌డంతో లాక్‌డౌన్‌ను మే 17 వ‌ర‌కు కంటిన్యూ చేశారు. ఇదే స‌మ‌యంలో మ‌రో సినిమాలో నటించ‌డానికి కాజ‌ల్ ఒప్పుకుంద‌ని ఆ డేట్స్‌కు, ఆచార్య సినిమాలో న‌టిస్తే క్లాష్ వ‌స్తుంద‌ని భావించి త‌ప్పుకుంద‌ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి.

అయితే ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని కాజ‌ల్ త‌న వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు కాజ‌ల్ ఆల్‌రెడీ అడ్వాన్స్ తీసుకుంద‌ని, క‌రోనా ప్ర‌భావం త‌గ్గి ఆచార్య షూటింగ్ స్టార్ట్‌కాగానే షెడ్యూల్‌లో కాజ‌ల్ పాల్గొంటుంద‌ట‌. కాజ‌ల్ ఇచ్చిన క్లారిటీతో రూమ‌ర్స్‌కు చెక్ ప‌డింది. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.