పెళ్లి తేదీ చెప్పేసిన కాజల్ అగర్వాల్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముంబైకి చెందిన బిజినెస్‌మేన్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోనుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు చెక్ పెడుతూ స్వయంగా కాజల్ అగర్వాల్ తన పెళ్లికి సంబంధించిన ప్రకటన చేసింది. అంతే కాకుండా పెళ్లి తర్వాత తన కెరీర్‌కు సంబంధించిన విషయాన్ని కూడా కాజల్ తెలియజేశారు. ఈ రెండు విషయాలకు సంబంధించిన అధికారిక ప్రకటననను కాజల్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది.
"ముంబైలో అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోబోతున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. సన్నిహితులైన బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ ఫంక్షన్ జరగనుంది. ఈ కోవిడ్ సమయం మన జీవితంలో సంతోషాలపై పెద్ద ప్రభావాన్ని చూపింది. అయితే ఈ పాండమిక్ సమయంలో మేం మా జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. దీనికి మీ అందరి ఆశీస్సులుంటాయని భావిస్తున్నాను. ఇన్నేళ్లు మీరు నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. నేను ఏదైతే బాగా ఇష్టపడ్డానో దాన్ని తిరిగి కంటిన్యూ చేస్తాను. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాను. మీ సహకారాన్ని అందిస్తారని భావిస్తున్నాను" అన్నారు కాజల్. యువ హీరోలతో పాటు సీనియర్ హీరోలైన చిరంజీవి, కమల్‌హాసన్ వంటి వారితో నటిస్తున్న కాజల్.పెళ్లి తర్వాత కూడా నటిస్తానని తెలిపారు.
— Kajal Aggarwal (@MsKajalAggarwal) October 6, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com