ఔను కాజల్ ప్రెగ్నెంట్.. కన్ఫర్మ్ చేసిన గౌతమ్ కిచ్లు, ఒకే ఒక్క పోస్ట్‌తో ప్రచారానికి చెక్

  • IndiaGlitz, [Sunday,January 02 2022]

గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రచారానికి సినీ నటి కాజల్ దంపతులు తెరదించారు. న్యూఇయర్ కానుకగా ఆమె తన అభిమానులకు శుభవార్త చెప్పారు. కాజల్ గర్భవతి అంటూ ఆమె భర్త గౌతమ్ కిచ్లు ఆదివారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గౌతమ్.. '2022.. నిన్నే చూస్తున్నా..' అంటూ ప్రెగ్నెంట్‌ లేడీ ఎమోజీని ఎటాచ్‌ చేశారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు కాజల్-గౌతమ్ లకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

తెలుగుతో పాటు దక్షిణాదిలోని అగ్రహీరోలందరితో నటించిన కాజల్.. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని గతేడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత సినిమాలకు స్వస్తి చెప్పకుండా.. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే కొన్ని ప్రాజెక్ట్స్‌లో నటించారు కాజల్. టాలీవుడ్ అగ్రకథానాయకుడు చిరంజీవితో ఆమె నటించిన 'ఆచార్య' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘‘ఉమ’’ అనే బాలీవుడ్ సినిమాలోనూ నటించింది. ఈ మూవీ విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. ఇందులో తానొక మిస్టీరియ‌స్ అమ్మాయి పాత్ర‌లో క‌నిపిస్తానని అభిమానులకు కాజల్ తెలియజేశారు.

అయితే తమిళ దర్శక దిగ్గజం శంకర్- విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘‘ఇండియ‌న్ 2’’లోనూ కాజల్ ఛాన్స్ దక్కించుకుంది. అయితే అనుకోని కారణాల వల్ల ఇప్పుడా ప్రాజెక్ట్ ఆగింది. అలాగే నాగార్జున- ప్రవీణ్ సత్తారు కలయికలో రూపొందుతున్న ‘‘ది ఘోస్ట్’’లోనూ కాజలే హీరోయిన్. అయితే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని ఫిలింనగర్ టాక్. గర్భవతి అయిన కారణంగానే కాజల్ కొన్ని సినిమాల నుంచి తప్పుకుందంటూ ప్రచారం జరిగింది. దీనిపై కాజల్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.. దీంతో నాటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. తాజాగా గౌతమ్ కిచ్లు ప్రకటనతో వాటికి తెరపడినట్లే.

More News

ఏఆర్ రెహమాన్ ఇంట్లో పెళ్లి భాజాలు… పెళ్లీపీటలెక్కనున్న పెద్ద కుమార్తె, వరుడు ఎవరంటే..?

భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగాయి. ఆయన కుమార్తె ఖతీజా రెహమాన్ నిశ్చితార్థం గత నెల 29న ఘనంగా జరిగింది.

టాలీవుడ్‌కు పెద్దదిక్కుగా ఉండను... పంచాయతీలు చేయను: చిరంజీవి కీలక వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు పెద్దగా ఉండటం తనకు అస్సలు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ టైంలో మా వల్ల కాదు .. ‘‘ఆర్ఆర్ఆర్’’ వాయిదా, చిత్రయూనిట్ అధికారిక ప్రకటన

అనుకున్నదే నిజమైంది.. ఊహాగానాలే వాస్తవాలయ్యాయి. టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘‘ఆర్ఆర్ఆర్’’ వాయిదా పడింది.

బంగార్రాజు టీజర్‌ : నాగ్, చైతూ కుమ్మేశారుగా.. సంక్రాంతికి విందు భోజనమే..!!

కింగ్ నాగార్జున, రమ్యకృష్ణ కలసి నటించిన ‘‘ సోగ్గాడే చిన్నినాయన’’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం బంగార్రాజు .

పుకార్లే నిజమయ్యాయి, షణ్ముఖ్‏తో ఐదేళ్ల బంధానికి బ్రేకప్.. దీప్తి సునయన ఎమోషనల్ పోస్ట్

యూట్యూబర్, టిక్‌టాక్  స్టార్ షణ్ముఖ్ జస్వంత్‌కు బిగ్‌బాస్ ఏమాత్రం కలిసొచ్చినట్లుగా లేదు. తృటిలో బిగ్‌బాస్ టైటిల్‌ను చేజార్చుకున్న షన్మూ..