వైభవంగా పంచదార బొమ్మ కాజల్ వివాహ వేడుక..
Send us your feedback to audioarticles@vaarta.com
పంచదార బొమ్మ కాజల్ వివాహ వేడుక వైభవంగా జరిగింది. తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లుతో ఆమె వివాహం శుక్రవారం రాత్రి జరిగింది. కరోనా కారణంగా అతి తక్కువ మంది అతిథుల సమక్షంలోనే ఈ వివాహ వేడుక ముగిసింది. అయితే పెళ్లికి ముందు జరిగిన వేడుకల్లో చాలా సంతోషంగా కనిపించిన కాజల్.. మరికాసేపట్లో పెళ్లి అనగా.. మౌనంగా గడిపినట్టు ఓ పోస్టులో పేర్కొంది. వివాహ వేడుకలో మాత్రం ఆమె చాలా సంతోషంగా కనిపించింది. కాజల్ వివాహానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కాజల్ పెళ్లి ఫోటోలను చూసిన అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాజల్, గౌతమ్‌ల పెయిర్ బాగుందంటూ కామెంట్లు పెడుతున్నారు.
‘లక్ష్మీ కల్యాణం’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కాజల్.. నెక్ట్స్ సినిమా ‘చందమామ’తోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా కాజల్ కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఇక ‘మగధీర’ చిత్రంతో కాజల్ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అక్కడి నుంచి కెరీర్ పరంగా ఆమె వెనుదిరిగి చూడలేదు. దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది. ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చిత్రంలోనూ.. కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’.. మంచు విష్ణుతో ‘మోసగాళ్లు’ చిత్రాల్లో నటిస్తోంది. వివాహం తర్వాత కూడా నటిస్తానని ఇప్పటికే కాజల్ స్పష్టం చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com