ఆరేళ్ల తరువాత కాజల్.. ఈ సారి ఏమౌద్దో?
- IndiaGlitz, [Thursday,August 10 2017]
కాజల్ పనైపోయిందని అనుకుంటున్న టైంలో.. జనతా గ్యారేజ్ లోని ఐటం సాంగ్‌తోనూ, ఖైదీ నెం.150లోని హీరోయిన్ పాత్రతోనూ మళ్లీ సక్సెస్ బాట పట్టింది టాలీవుడ్ చందమామ. ఈ ముద్దుగుమ్మ తాజా చిత్రం నేనే రాజు నేనే మంత్రి ఈ శుక్రవారం విడుదల కానుంది. తన తొలి తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన తేజ దర్శకత్వంలో పదేళ్ల తరువాత మళ్లీ ఈ సినిమా కోసమే నటించింది కాజల్.
ఇందులో పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న రాధ అనే పాత్రలో కాజల్ నటించింది.ఇదిలా ఉంటే.. ఈ చిత్రం విషయంలో కాజల్ కి రెండు నెగెటివ్ సెంటిమెంట్స్ ఉన్నాయి. తేజ దర్శకత్వంలో నటించిన తొలి చిత్రం ఫ్లాప్ అవడం అనేది ఒకటి కాగా.. నేనే రాజు నేనే మంత్రి విడుదలవుతున్న ఆగస్టు 11నే ఆరేళ్ల క్రితం నాగచైతన్యతో కాజల్ జోడీ కట్టిన దడ విడుదలై డిజాస్టర్ అయింది. నాగచైతన్య విషయంలో కలిసి రాని ఆగస్టు 11.. అదే కుటుంబానికి చెందిన మరో హీరో రానాతో అయినా కాజల్‌కి కలిసొస్తుందో లేదో మరి.