ప్రియాంక స్థానం కాజ‌ల్ అగ‌ర్వాల్‌..?

  • IndiaGlitz, [Friday,July 24 2020]

ద‌శాబ్దం కాలం ముందు తెలుగు ప్రేక్ష‌కుల‌ను హీరోయిన్‌గా ప‌ల‌క‌రించింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. చంద‌మామ‌లాంటి అమ్మ‌డు న‌చ్చ‌డంతో ఈమెకు తెలుగులో అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. త‌ర్వాత తమిళంలో స్టార్స్‌తో క‌లిసి న‌టించింది. అలాగే బాలీవుడ్‌లోనూ రెండు మూడు సినిమాల్లో న‌టించింది. ఇన్నేళ్ల‌యినా కాజ‌ల్ అగ‌ర్వాల్ కుర్ర హీరోయిన్స్‌కు పోటీనిస్తూ భారీ చిత్రా్ల్లో అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది. ఇప్పుడు అదే స్పీడుతో అమ్మ‌డు ఓ భారీ అవ‌కాశాన్ని అందుకుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అవునా? అంటే అవున‌నే సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

అస‌లు కాజ‌ల్‌కు ఇంతూ ఎలాంటి అవ‌కాశం వ‌చ్చింది? అనే వివరాల్లోకెళ్తే..కాజ‌ల్ అగ‌ర్వాల్ ఓ వెబ్ సిరీస్‌లో న‌టించ‌నుందట‌. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక‌చోప్రాకు హాలీవుడ్ ఇమేజ్ తీసుకొచ్చిన క్వాంటికో వెబ్ సిరీస్‌ను ఇండియ‌న్ వెర్ష‌న్‌లో నెట్‌ఫ్లిక్స్ నిర్మించ‌నుంద‌ట‌. ఈ వెబ్ సిరీస్‌లో కాజ‌ల్ న‌టించ‌నుందని టాక్‌. భార‌త‌దేశంలో ప‌లు భాష‌ల్లో ఈ వెబ్ సిరీస్ తెర‌కెక్క‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. క్వాంటికోలో ప్రియాంక చోప్రా హాట్ హాట్‌గా న‌టించి మెప్పించింది. ఇప్పుడు కాజ‌ల్ కూడా హాట్ హాట్‌గా న‌టిస్తుందేమో చూడాలి.