చిరుకే కాదు తనక్కూడా..

  • IndiaGlitz, [Thursday,August 17 2017]

గ‌తేడాది ఏ సినిమా చేసినా.. టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌కి నిరాశే ఎదురైంది. అయితే ఈ ఏడాది మాత్రం కాజ‌ల్‌కి అనుగుణంగానే ఉంది.. ఇప్ప‌టివ‌ర‌కు. ఈ సంవ‌త్స‌రంతోనే తెలుగులో ప‌దేళ్ల కెరీర్‌ని పూర్తిచేసుకున్న కాజ‌ల్ కి.. ఈ ఏడాదిలో రిలీజైన రెండు తెలుగు చిత్రాలు స‌క్సెస్ అయి ఆమెలో ఉత్సాహాన్ని నింపాయి. ఆ చిత్రాలే 'ఖైదీ నెం.150', 'నేనే రాజు నేనే మంత్రి'.

విశేష‌మేమిటంటే.. ఈ రెండు చిత్రాలు కూడా ల్యాండ్ మార్క్ చిత్రాలు కావ‌డం. 'ఖైదీ నెం.150' చిత్రం మెగాస్టార్ చిరంజీవికి 150వ సినిమా అయితే.. 'నేనే రాజు నేనే మంత్రి' కాజ‌ల్‌కి 50వ సినిమా. అంటే చిరు ల్యాండ్ మార్క్ చిత్రంతో పాటు.. త‌న ల్యాండ్ మార్క్ మూవీ కూడా కాజ‌ల్‌కి ప్ల‌స్ అయింద‌న్న మాట‌.

ప్ర‌స్తుతం కాజ‌ల్, త‌న తొలి తెలుగు హీరో క‌ళ్యాణ్‌రామ్ తో క‌లిసి 'ఎం.ఎల్‌.ఎ' అనే సినిమా చేస్తోంది. ఆమె న‌టించిన త‌మిళ చిత్రాలు 'వివేకం', 'మెర్స‌ల్' విడుద‌ల‌కు సిద్ధ‌మౌతున్నాయి.