గుండె పగిలిందంటూ ఎమోషనల్ అయిన కాజల్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఆరికట్టడానికి ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ఎక్కడా బయట తిరగవద్దని అంటున్నారు. ఆఫీసులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో తనకు ఎదురైన ఓ ఘటనను హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన ఇన్‌స్టా ద్వారా షేర్ చేసుకున్నారు. రోజువారి ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు ఈ పరిస్థితుల్లో పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని కాజల్ తనకు ఎదురైన ఘటన ద్వారా తెలిపారు.
‘‘సామాన్యమైన ప్రజలు కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఓ క్యాబ్ డ్రైవర్ నా ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కరోనా కారణంగా తనకు బేరాల్లేవ్. 48 గంటల్లో నేనే తన తొలి కస్టమర్ అని చెప్పుకుని ఏడ్చాడు. రోజువారి ఆదాయంతో కుటుంబాలను పోషించుకునే వారి జీవితాలు చాలా సమస్యాత్మకంగా మారాయి. నేను ఆ క్యాబ్ డ్రైవర్‌కి రూ.500 ఇచ్చాను. ఇలా మనం ఇవ్వడం మనకు పెద్ద సమస్య కాకపోవచ్చు. దయచేసి చిన్న దుకాణదారులకు, క్యాబ్ డ్రైవర్స్‌కు కాస్త ఎక్కువ డబ్బులు ఇవ్వండి. ఆరోజు మీరే వారికి చివర కస్టమర్ కావచ్చు’’ అంటూ కాజల్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout