గుండె ప‌గిలిందంటూ ఎమోష‌న‌ల్ అయిన కాజ‌ల్‌

  • IndiaGlitz, [Wednesday,March 18 2020]

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్‌ను ఆరిక‌ట్ట‌డానికి ప్ర‌భుత్వాలు ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను ఎక్క‌డా బ‌య‌ట తిర‌గ‌వ‌ద్ద‌ని అంటున్నారు. ఆఫీసులు కూడా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఇవ్వ‌డంతో అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో త‌న‌కు ఎదురైన ఓ ఘ‌ట‌న‌ను హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న ఇన్‌స్టా ద్వారా షేర్ చేసుకున్నారు. రోజువారి ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు ఈ ప‌రిస్థితుల్లో ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నార‌ని కాజ‌ల్ త‌న‌కు ఎదురైన ఘ‌ట‌న ద్వారా తెలిపారు.

‘‘సామాన్య‌మైన ప్ర‌జ‌లు క‌రోనా వైర‌స్ కార‌ణంగా తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. ఓ క్యాబ్ డ్రైవ‌ర్ నా ముందు నిల‌బ‌డి క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. క‌రోనా కార‌ణంగా త‌న‌కు బేరాల్లేవ్‌. 48 గంట‌ల్లో నేనే త‌న తొలి క‌స్ట‌మ‌ర్ అని చెప్పుకుని ఏడ్చాడు. రోజువారి ఆదాయంతో కుటుంబాల‌ను పోషించుకునే వారి జీవితాలు చాలా స‌మ‌స్యాత్మ‌కంగా మారాయి. నేను ఆ క్యాబ్ డ్రైవ‌ర్‌కి రూ.500 ఇచ్చాను. ఇలా మ‌నం ఇవ్వ‌డం మ‌న‌కు పెద్ద స‌మ‌స్య కాక‌పోవ‌చ్చు. ద‌య‌చేసి చిన్న దుకాణ‌దారులకు, క్యాబ్ డ్రైవ‌ర్స్‌కు కాస్త ఎక్కువ డ‌బ్బులు ఇవ్వండి. ఆరోజు మీరే వారికి చివ‌ర క‌స్ట‌మ‌ర్ కావ‌చ్చు’’ అంటూ కాజ‌ల్ తెలిపారు.

More News

పాట‌తో షురూ చేయ‌నున్న బాల‌య్య‌

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో

నమితకు యువకుడి బెదిరింపులు.. స్ట్రాంగ్ వార్నింగ్

అందాల ముద్దుగుమ్మ.. బొద్దుగుమ్మ నమిత గురించి సినీ ప్రియులకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ చిత్రాల్లో ఓ మెరుపు మెరిసిన నమిత..

కరోనాకు ఇదే అసలైన మందు..: మహేశ్ బాబు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ చాలా వరకు జనాల్లోకి వెళ్లలేదు.

కరోనాపై పోరాటం.. స్వీయ నిర్భందంలో ప్రియదర్శి

కరోనాపై టాలీవుడ్ పోరాటం చేస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు, ఫంక్షనలు దాదాపు అన్నీ బంద్ చేసేసింది.

సీతారాముల పెళ్ళికి ఎవరూ రావొద్దు : మంత్రి ప్రకటన

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ మొదలుకుని థియేటర్స్, జిమ్స్ ఇలా అన్నీ బంద్ చేసేసింది.