కాజల్ సీన్ రివర్సయ్యింది
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకే పనిని రెండు సార్లు చేస్తే.. రెండు సార్లూ ఒకేలా ఫలితం రావాలనేం లేదుగా. ఒక సారి వర్కవుట్ అయితే.. మరోసారి తేడా కొట్టొచ్చు. లేదంటే మొదటి సారి నెగెటివ్ రిజల్ట్ వచ్చి.. రెండోసారి పాజిటివ్ రిజల్ట్ రావచ్చు. ఇదిగో ఈ రెండో వెర్షన్లోనే ఉంది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ పరిస్థితి.
సరిగ్గా ఆరేళ్ల క్రితం ఆగస్టు 11న కాజల్ హీరోయిన్గా నటించిన 'దడ' డిజాస్టర్ అయి.. కాజల్ కెరీర్లో ఓ మరకలా మిగిలింది. ఇంకా చెప్పాలంటే.. ఆ సినిమాలో కాజల్ ఏ సినిమాలో కనిపించనంత గ్లామర్ లెస్ గా కనిపించిందని అప్పట్లో విమర్శలు వినిపించాయి. కట్ చేస్తే.. ఆరేళ్ల తరువాత అదే తేది రివర్స్‌లో రిజల్ట్ ఇచ్చింది. తాజాగా అదే ఆగస్టు 11న విడుదలైన కాజల్ 50వ చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' ఆమె కెరీర్లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది. ఇందులోని రాధ పాత్రలో కాజల్ లుక్స్‌కి, యాక్టింగ్‌కి ఫిదా అయిపోతున్నారు తెలుగు ప్రేక్షకులు. ఒకే తేది.. ఆరేళ్ల గ్యాప్‌లో కాజల్‌కి రెండు రకాల అనుభూతులిచ్చిందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments