భరత్ అనే నేను.. కైరా పాత్ర ఏంటంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
మహేష్ బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'భరత్ అనే నేను'. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ నటిస్తుండగా.. సితార, ప్రకాష్ రాజ్, ఆమని, పోసాని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ చిత్రానికి.. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మంగళవారం విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి బయటికి వచ్చింది.
ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్న మహేష్‌కు పి.ఎ.గా కైరా అద్వాని కనిపించనుందని సమాచారం. నటనకు అవకాశమున్న ఈ పాత్రలో కైరా చక్కగా నటిస్తోందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం.. ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments