'అర్జున్ రెడ్డి'లో మ‌హేశ్ హీరోయిన్‌

  • IndiaGlitz, [Sunday,September 23 2018]

తెలుగులో గ‌త ఏడాది ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. క‌ల్ట్ మూవీ అంటూ అందరితో ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రం త‌మిళంలో, హిందీలో రీమేక్ అవుతున్నాయి. హింధీ విష‌యానికి షాహిద్ క‌పూర్ అర్జున్‌రెడ్డిగా న‌టిస్తున్నాడు.

ఇత‌నికి జోడిగా తారా సుతైరాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2' సినిమాలో కూడా న‌టించాల్సి ఉంది.

ఈ రెండు సినిమాల డేట్స్ క్లాష్ వ‌స్తుండ‌టంతో అర్జున్ రెడ్డి ప్రాజెక్ట్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇప్పుడు ఈ చిత్రంలో హీరోయిన్‌గా 'ధోని', 'భ‌ర‌త్ అనే నేను' చిత్రాల హీరోయిన్ కియరా అద్వాని న‌టించ‌నుంది. త్వ‌ర‌లోనే ఈ విష‌యమై అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది.