ఇక సెలవు : అధికారిక లాంఛనాలతో ముగిసిన కైకాల అంత్యక్రియలు...

  • IndiaGlitz, [Saturday,December 24 2022]

దిగ్గజ నటుడు, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. అంతకుముందు శనివారం ఉదయం ఫిలింనగర్‌లోని కైకాల ఇంటి నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. అనంతరం సత్యనారాయణ కుమారుడు తండ్రికి అంతిమ సంస్కరాలు నిర్వహించారు. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంత్యక్రియలు ముగిసే వరకు అక్కడే వుండి పర్యవేక్షించారు.

కైకాలతో మా కుటుంబానికి విడదీయరాని బంధం: అల్లు అరవింద్

శనివారం కూడా పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు కైకాల పార్ధివ దేహానికి నివాళులర్పించారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. కైకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. ఆయనతో తమ కుటుంబానికి మంచి బంధం వుందని గుర్తుచేసుకున్నారు. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరితో కలివిడిగా వుండేవారని అల్లు అరవింద్ తెలిపారు.

పెద్దలను కోల్పోతుండటం బాధగా వుండి : జీవితా రాజశేఖర్

సీనియర్ నటి రాధ మాట్లాడుతూ.. కైకాలతో తనకు స్పెషల్ బాండింగ్ వుందన్నారు. ఎప్పుడు కనిపించాన ఆప్యాయంగా పలకరించేవారని తెలిపారు. ఆయనతో కలిసి 50 సినిమాల్లో నటించానని, చివరిసారిగా హైదరాబాద్‌లో ఓ ఫంక్షన్‌లో కైకాల సత్యనారాయణను కలిసినట్లు రాధ చెప్పారు.  తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్దలను ఒక్కొక్కరిని కోల్పోవడం బాధగా వుందన్నారు సినీ నటి జీవితా రాజశేఖర్. అందరినీ కోల్పోతుంటే అనాథలా అనిపిస్తుందని.. కైకాల సత్యనారాయణ మరణం తీరనిలోటన్నారు.  

అనారోగ్యంతో కన్నుమూసిన కైకాల :

కాగా.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ ఫిలింనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. 60 సంవత్సరాల సుధీర్ఘ ప్రస్థానంలో 777 సినిమాల్లో నటించారు కైకాల సత్యనారాయణ. రమా ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు చిత్రాలను నిర్మించారు. రాజకీయాలపై ఆసక్తితో 1996లో మచిలీపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు.

More News

Pawan Kalyan, Balakrishna:బాలయ్యతో చేయి కలిపిన పవన్.. రెండు కళ్లు చాలడం లేదుగా, ఫోటో వైరల్

తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, బాలకృష్ణలు సొంత అన్నదమ్ముల్లా మసలుతారు.

Lucky Lakshman : నడి సముద్రంలో పడిపోయిన సోహైల్.. తృటిలో తప్పిన ప్రమాదం, జాలర్లు స్పందించకుంటే

యువ నటుడు, బిగ్‌బాస్ ఫేం సయ్యద్ సోహైల్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.

భోజనానికి వస్తానని.. అంతలోనే : కైకాల మరణంపై కృష్ణంరాజు సతీమణి ఎమోషనల్

నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే.

Rewind 2022: కలిసిరాని కాలం

కాలచక్ర గమనంలో మరో సంవత్సరం కలిసిపోనుంది. 2022 మరికొద్దిరోజుల్లో పాత సంవత్సరం కానుంది.

Kaikala SatyaNarayana : స్వర్గానికి నరకాధిపతి.. నవరస నటనా సార్వభౌముడికి ప్రముఖుల నివాళి

తెలుగు చిత్ర పరిశ్రమ మరో మహానటుడిని పొగొట్టుకుంది. ఇప్పటికే కృష్ణ, కృష్ణంరాజుల మరణాలతో తీవ్ర దిగ్భ్రాంతిలో వున్న టాలీవుడ్‌కు