అవన్నీ వదంతులే... నాన్నగారు కోలుకుంటున్నారు: తప్పుడు కథనాలపై కైకాల కుమార్తె ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం ఉదయం తెలుగు మీడియాలో ఒక్కసారిగా తప్పుడు వార్తలు గుప్పుమన్నాయి. ఆయన మృతి చెందినట్లుగా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగింది. దీనిపై సత్యనారాయణ కుమార్తె రామాదేవి స్పందించారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దనీ, నాన్నగారు కోలుకుంటున్నారనీ సత్యనారాయణ కుమార్తె రమాదేవి విజ్ఞప్తి చేశారు. తమ తండ్రి ఆరోగ్య స్థితి గురించి ప్రచారం జరుగుతున్నదంతా తప్పుడు వార్తలేనని ఆమె ఖండించారు. ఈ మేరకు ఆడియో క్లిప్ రిలీజ్ చేశారు.
నేను కైకాల రామాదేవి. సత్యనారాయణ గారి అమ్మాయిని. నాన్నగారి ఆరోగ్య పరిస్థితి బావుంది. ఆయన కోలుకుంటున్నారు. చికిత్సకు స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. నిన్న డాక్టర్, యాక్టర్ మాదాల రవి గారు వచ్చారు. ఆయనతో నాన్నగారు మాట్లాడారు. థంబ్స్ అప్ సింబల్ చూపించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టీవీల్లో తప్పుడు సమాచారం చూపించి ప్రజలను టెన్షన్ పెట్టొద్దని రామాదేవి కోరారు.
కాగా.. కొద్దిరోజుల క్రితం బాత్‌రూంలో జారిపడటంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకుని కోలుకున్నారు. కొద్దిరోజులు బాగానే ఉన్నప్పటికీ.. మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సత్యనారాయణను కుటుంబసభ్యులు .. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. నాటి నుంచి ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తూ వస్తున్నారు. గత ఆదివారం కైకాల కోలుకున్నారని ఆయనతో ఫోన్‌లో మాట్లాడానని, త్వరలోనే క్షేమంగా తిరిగి వస్తారని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ట్వీట్ చేయడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రెండు రోజులుగా కైకాల ఆరోగ్యం విషమించినట్లుగా అపోలో వైద్యులు హెల్త్ బులిటిన్ విడుదల చేయడంతో సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు వైరల్ అయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com