కూరగాయలు, పువ్వులతో కేసీఆర్ చిత్రం.. తెలంగాణ సీఎంకు కడియంలో వినూత్నంగా బర్త్ డే విషెస్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే చంద్రశేఖర్ రావుకు ఏపీలోనూ అభిమానులున్న సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేయడంతో పాటు పలు చోట్ల భారీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన కేసీఆర్ అభిమాని ఒకరు ఆయనపట్ల అభిమానం చాటుకున్నారు. రకరకాల పూలు, పండ్లు, కూరగాయాల మొక్కలతో ఆయన చిత్రాన్ని రూపొందించారు.
స్థానిక గ్రీన్ లైఫ్ నర్సరీ యజమాని తిరుమలశెట్టి శ్రీనివాస్‌కు కేసీఆర్ అంటే ఎనలేని అభిమానం. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ రైతుల కోసం చంద్రశేఖర్ రావు చేస్తున్న కృషికి కృతజ్ఞతగా ఆయన ముఖ చిత్రాన్ని కూరగాయలు, పువ్వులతో అలంకరించామన్నారు. ప్రతిష్టాత్మక హరితహారం కార్యక్రమం ద్వారా కడియం మండలంలో రైతుల వద్ద నుంచి భారీగా మొక్కలను కొనుగోలు చేస్తూ ఆర్థికంగా సహకరిస్తున్న కేసీఆర్‌కి ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని శ్రీనివాస్ అన్నారు.
అటు తన తండ్రి , తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. గురువారం అలిపిరి నడక మార్గం వద్దకు చేరుకున్న ఆమె.. నిరుపేదలకు అన్నదానం చేశారు. అనంతరం సప్తగోప్రదక్షిణ మందిరాన్ని కవిత సందర్శించారు. అనంతరం గోపూజలో కవిత, అనిల్ దంపతులు పాల్గోన్నారు. గోమందిరంలో రుద్రాక్ష మొక్కను నాటారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments