బాలయ్యను కూడా బాబు మోసం చేస్తాడేమో.. : ప్రాణ స్నేహితుడు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాణ స్నేహితుడు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఆ పార్టీకి టాటా చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం నాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ కండువా కప్పిన జగన్.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిక అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ కంచుకోట అయినప్పటికీ..
‘ నా మొదటి ఓటు టీడీపీకి వేశాను. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో సభ్యుడిగా ఉన్నాను. అయితే 2014లో కనిగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. దీంతో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు సన్నిహితుడిగా కూడా ఉన్నందున.. ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ పోటీ చేశాను. వాస్తవానికి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో వైఎస్సార్ అభిమానులు ఎక్కువగా ఉంటారు. అది వైసీపీకి కంచుకోట. కానీ.. ఆ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ నుంచి పోటీ చేసి 12 వేల మెజారిటీతో నేను విజయం సాధించాను’ అని కదిరి బాబూరావు చెప్పుకొచ్చారు.
చాలా తేడా ఉంది..!
‘మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి.. నమ్మక ద్రోహం చేయడంలో చంద్రబాబు దిట్ట. జగన్పై ఉన్న నమ్మకంతో వైసీపీలో చేరాను. నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఆయనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుకే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాను. బాలకృష్ణతో ఉన్న స్నేహంతో ఇన్నాళ్లూ టీడీపీలో ఉన్నాను. నందమూరి వారికి, నారా వారికి చాలా తేడా ఉంది’ అని కదిరి చెప్పుకొచ్చారు.
బాలయ్య మాటంటే లెక్కలేదు..
‘బాలయ్య చెప్పిన మాటను కూడా చంద్రబాబు కనీసం విలువ ఇవ్వలేదు. బాలకృష్ణను విడిచి వెళ్లాంటే బాధగా ఉంది. బాలయ్య చాలా మంచి వారు. నందమూరి ఎన్టీఆర్, బాలయ్యల వ్యక్తిత్వం వేరు.. నారా వారి వ్యక్తిత్వం వేరు. ఎన్టీఆర్, బాలయ్య దేవుళ్ల వంటి వారు.. బాబు మాత్రం నమ్మక ద్రోహి. అలాంటి వ్యక్తి దగ్గర ఇమడలేకనే, ఆత్మాభిమానం చంపుకుని వైసీపీలో చేరుతున్నాను. నిజంగా బాలయ్య చాలా మంచి వ్యక్తి, అమాయకుడు. బాలయ్యను కూడా చంద్రబాబు ఎలా మోసం చేస్తాడో తెలియదు. ఈ విషయాన్ని బాలయ్య కూడా అర్థం చేసుకోవాలి’ అని ఈ సందర్భంగా బాలయ్యకు కదిరి సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com