ఈనెల 30న 'కదిలే బొమ్మల కథ'
- IndiaGlitz, [Wednesday,June 28 2017]
శ్రీమతి మేరుగు బతుకమ్మ ఆశీస్సులతో తరుణిక ఆర్స్ట్ పతాకంపై అజయ్ నిర్మిస్తోన్న చిత్రం 'కదిలే బొమ్మల కథ'. నాజర్, జీవా, ప్రియ, బాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శశిధర్. బి దర్శకత్వం వహించారు . ఈ సినిమా ట్రైలర్ ను బుధవారం హైదరాబాద్ ఫిలించాంబర్ లో ప్రదర్శించారు. అలాగే అన్ని పనులు పూర్తిచేసుకుని ఈనెల 30 న సినిమా విడుదలవుతుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అజయ్ మాట్లాడుతూ, ' సమాజంలో స్ర్తీలు డిఫ్రషన్ కు గురైనప్పుడు తమను తాము ఎలా మార్చుకోవాలనే పాయింట్ ను హైలైట్ చేస్తూ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందించాం. సినిమా బాగా వచ్చింది. థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇటీవలే తెలంగాణ రాష్ర్ట హోమంత్రి నాయిని నరసింహారెడ్డి ట్రైలర్..ప్రోమోలు చూసి ప్రశంసించారు. ఈనెల 30న సినిమా విడుదల చేస్తున్నాం. సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు' అని అన్నారు.
చిత్ర దర్శకుడు శశిధర్ మాట్లాడుతూ, ' తెరమీద బొమ్మలు ఆడే కథలా కాకుండా సమాజంలో మహిళలు ఎలా బొమ్మలాటకు గురవుతున్నారన్నదే చూపిస్తున్నాం. సినిమా బాగా వచ్చింది. నటీనటులంతా చక్కగా నటించారు. టెక్నికల్ గాను సినిమా హైలైట్ గా ఉంటుంది. ట్రైలర్ చూసి నటీనటులను, దర్శకుడిని అంతా మెచ్చుకున్నారు. సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అని అన్నారు.
'గుంటూరోడు' దర్శకుడు సత్య మాట్లాడుతూ, ' టైటిల్ బాగుంది. మంచి కంటెంట్ ఉన్న కథ ఇది. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు, నిర్మాతలు లాభాలు తీసుకురావాలి' అని అన్నారు.
'థ్రిల్లింగ్ అంశాలతో దర్శకుడు సినిమా బాగా తెరకెక్కించారు. మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులున్నారు. కొంత మంది కొత్తవారైనా చక్కగా నటించారు. సినిమా విజయం సాధించాలి. చిన్న సినిమాలు విజయం సాధిస్తేనే మరింత మంది నిర్మాతలు సినిమాలు చేయడానికి ముందుకొస్తారు. సినిమా ఇండస్ర్టీ చిన్న సినిమాల వలనే నిలబడుతుంది' అని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యానారయణ అన్నారు.
హీరో బాలు మాట్లాడుతూ, 'ఈ సినిమాకు కథే హీరో. స్ర్తీలు తమను తాము కాపాడుకోవడానికి తాను కట్టుకున్న చీర కుచ్చీలకు పెట్టుకున్న పిన్ను కూడా ఆయుధంగా మార్చుకోవచ్చని స్ర్తీ ధైర్యం గురించి తెలిపే సినిమా ఇది. మహిళలను చైతన్య పరుస్తుంది. ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు.
శ్రీతేజ్, రవి ప్రకాష్, గౌతం రాజు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ మాడిశెట్టి కృపాల్, ఛాయాగ్రహణం: తిరుమల రావు.బి, సంగీతం: నరేష్ రావుల, ఎడటింగ్: కార్తీక్ శ్రీనివాస్, సహ నిర్మాతలు : వసంత, శివరాం, సుధాకర్, జేమ్స్, ఎగ్యిక్యూటివ్ ప్రొడ్యూసర్: తిరుమల్ .టి, అరుణ్, రచన- దర్శకత్వం :శశిధర్.బి, నిర్మాత: అజయ్ మేరుగు