‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వివాదంలో కడప జాయింట్ కలెక్టర్ బలి!
Send us your feedback to audioarticles@vaarta.com
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వివాదం కడప జిల్లా జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావుకు ఎసరు తెచ్చిపెట్టింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అంతటితో ఆగని ఈసీ.. జాయింట్ కలెక్టర్‌ను బదిలీ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 19వరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ఏపీలో విడుదల చేయకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు.
అసలేంటి వివాదం..!
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైనప్పటికీ ఏపీలో విడుదల కాలేదన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల తర్వాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావించిన చిత్రబృందం అనుకున్నట్లుగానే ఏపీలోని కొన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి యత్నించింది. అప్పటికే ఎన్నికల కమిషన్, హైకోర్టు నిబంధనలతో చాలా వరకు థియేటర్ల యాజమాన్యాలు జంకాయి. అంతేకాదు సినిమా రిలీజ్ కాకుండా చూడాలని ఎన్నికల ప్రధాన అధికారి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
కడపలో ఎక్కడ రిలీజైంది..!
అయితే కడప జిల్లాతో పలు చోట్ల థియేటర్లలో ఈ సినిమా ప్లే చేశారు. దీంతో ఇది ఎన్నికల కమిషన్ ఆయా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. కాగా.. మే 1న కడపలోని రాజా థియేటర్, పోరుమామిళ్లలోని వెంకటేశ్వర, రైల్వేకోడూరులోని ఏఎస్ఆర్ థియేటర్లలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ప్రదర్శించిన విషయం విదితమే. కాగా ఇప్పటికే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకుగాను ఆయా థియేటర్లను అధికారులు సీజ్ చేసి.. సంబంధిత లైసెన్స్‌లను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com