బోటు ఆపరేషన్ సక్సెస్.. అతికష్టమ్మీద వెలికితీత
Send us your feedback to audioarticles@vaarta.com
తూర్పుగోదావరి గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును సుమారు నెలరోజుల తర్వాత ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం శ్రమించి పట్టుదలతో బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని నీటిపైకి తీసుకొచ్చారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరికొంత సేపట్లో బోటును ఒడ్డుకు తీసుకురానున్నారు. గత కొన్ని రోజులుగా విశ్వప్రయత్నాలు చేస్తున్న సత్యం టీమ్ స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు చేసిన సక్సెస్ అయ్యాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్‌లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు.
హృదయ విదారక దృశ్యాలు..!
వెలికి తీసిన బోటులో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు మృతదేహాలు బయటపడగా.. తాజాగా మరో ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. ఇవన్నీ గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. బోటులో మరిన్ని మృతదేహాలు ఉన్నాయి. వీటిని వెలికి తీయాల్సి ఉంది. అయితే బోటు పూర్తిగా ధ్వంసమై ఉంది. సెప్టెంబర్ 15న బోటు ప్రమాదం జరగ్గా 38 రోజుల తర్వాత వెలికి తీసే ప్రయత్నాలు ఫలించాయి.
ఎవరి సాయం తీసుకోలేదు.. చాలా హ్యాపీ!
ఈ సందర్భంగా ధర్మాడి సత్యంను మీడియా పలకరించగా ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన రోజున పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. వరద నీటి ప్రవాహం పెరిగిపోవడం కారణంగా వెలికితీత పనులు మధ్యలో ఆగిపోయాయి.. ఆ తర్వాత మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాం. నిన్న నదిలో ప్రవాహం పెరిగింది.. అయినప్పటికీ, బోటును బయటకు తీయాలన్న పట్టుదలతో పనులు ఆపలేదు. బోటును బయటకు తీసేందుకు మొత్తం మూడు రోప్స్ వేశాము.. అందులో రెండు రోప్స్‌ను కింద నుంచి వేసి బయటకు లాక్కురాగలిగాము. బోటు వెలికితీత పనుల్లో మా బ్యాచ్‌లో 25 మంది పాల్గొన్నారు. ఈ ఆపరేషన్‌లో రెవెన్యూ, పోలీస్, పోర్టు అధికారుల నుంచి ఎలాంటి సాయం తీసుకోలేదు. నా పట్టుదల, మా వాళ్ల సహకారం, నా అనుభవం వల్లే ఈ బోటును వెలికితీయగలిగాం. నేను హ్యాపీగా ఫీలవుతున్నాను’ అని ధర్మాడి సత్యం మీడియాకు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments