పాన్ ఇండియా మూవీ ‘83’కి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను తెలిపిన కబీర్‌ఖాన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియన్ క్రికెట్‌ను గతిని మార్చిన ఏడాది 1983. ఈ ఏడాది భారతదేశం క్రికెట్ ప్రపంచంలో రారాజుగా అవతరించింది. కపిల్ డేర్ డెవిల్స్ సాధించిన అపూర్వ విజయంతో చాలా మందికి క్రికెట్ ఫేవరేట్ గేమ్‌గా మారింది. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ‘83’ పేరుతో వెండితెరపై ఆవిష్కరించారు డైరెక్టర్ కబీర్‌ఖాన్. ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమ స్తంభించింది. ఈ కారణంగా విడుదల కావాల్సిన ‘83’ సినిమా విడుదలను నిర్మాతలు వాయిదా వేశారు.
ఈ ప్రయాణంలో పలు ఆసక్తికరమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. వీటన్నింటినీ 83 సినిమాలో ఆవిష్కరించారు డైరెక్టర్ కబీర్‌ఖాన్. 20 జూన్ 1983న జరిగే గ్రూప్ మ్యాచ్‌లతోనే ఇండియన్ టీమ్ క్రికెట్ టీమ్ టూర్ ముగుస్తుందని అందరూ భావించారు. జూన్ 22న ఫైనల్ మ్యాచ్‌ను షెడ్యూల్ చేశారు. చాలా మంది రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. టీమ్‌లో రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న ఏడు మంది సభ్యులు వారి భార్యలతో కలిసి వెకేషన్ కూడా ప్లాన్ చేసుకున్నారు. జూన్ 20న ముగిసే గ్రూప్ మ్యాచ్‌లు తర్వాత న్యూయార్క్ తదితర ప్రాంతాలకు వెకేషన్ వెళ్లాలనుకున్నారు.
దర్శకుడు కబీర్ ఖాన్ మాట్లాడుతూ - ‘‘1983 వరల్డ్ కప్‌కు సంబంధించిన ప్రయాణంలో నా దగ్గర 100 కథలున్నాయి. వాటిలో నుండి 25 కథలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించాను. ఈ స్క్రిప్ట్‌ను తయారు చేయడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి. కేవలం ఆటగాళ్ల కోణంలోనే కాకుండా కామెంటేటర్స్, ప్రేక్షకుల కోణంలోనూ సాగుతుంది. శ్రీకాంత్ సహా మరో ఆరుగురు ఆటగాళ్లు గ్రూపు మ్యాచ్‌లు ముగియగానే వెకేషన్స్ బయలుదేరాలని అనుకున్నారు. ఆ ఏడుగురు ఆటగాళ్లు ముంబై నుండి న్యూయార్క్‌కి వయా లండన్ మీదుగా టికెట్స్‌ను బుక్ చేసుకున్నారు. శ్రీకాంత్‌గారు సహా చాలా మంది ఆటగాళ్లకి గ్రూపు మ్యాచ్‌లను దాటుతామనే నమ్మకం లేదు’’ అన్నారు.
ఇండియ్ టీమ్‌లో చాలా మందికి ఈ టోర్నమెంట్ విజయంపై పెద్దగానమ్మకం లేదు. అయితే వారందరూ చక్కగా పెర్ఫామ్ చేయడంతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా క్రికెట్ హిస్టరీలో ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించారు.
రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంటమ్ ఫిలిమ్స్ బ్యానర్స్ సమర్పణలో కబీర్‌ఖాన్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ పతాకంపై దీపికా పదుకొనె కబీర్‌కాన్, విష్ణు ఇందూరి, సాజిద్ నడియడ్ వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout