'కబాలి' ట్రిమ్మింగ్

  • IndiaGlitz, [Sunday,July 24 2016]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన క‌బాలి జూలై 22న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై సెన్సేష‌న‌ల్ క‌లెక్ష‌న్స్‌సాధిస్తుంది. తమిళం, తెలుగుతో పాటు మొత్తం మీద 30 ప్ర‌పంచ దేశాల్లో విడుద‌లైన క‌బాలి నిడివి కాస్తా ఎక్కువైంద‌నే టాక్ రావ‌డంతోపాటు సినిమాపై విడుద‌ల రోజు నుండి మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. దాంతో ఏం చేయాల‌ని ఆలోచించిన ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇప్పుడు సినిమాను 12 నిమిషాలు ట్రిమ్ చేస్తున్నార‌ట‌. ఈ ట్రిమింగ్ అయిపోగానే ఈ కొత్త వెర్ష‌న్‌ను సోమ‌వారం నుండి అన్నీ థియేటర్స్‌లో ప్ర‌ద‌ర్శిస్తార‌ట‌. మ‌రోవైపు త‌మ అభిమాన హీరో ర‌జ‌నీకాంత్‌ను ఎలాగో చూపిస్తాడ‌ని అనుకున్న ర‌జ‌నీకాంత్ అభిమానులు పా రంజిత్‌పై గుర్రుగానే ఉన్నార‌ట‌.