కబాలి టీజర్ రిలీజ్ ఆ రోజే..
Saturday, April 30, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడుగా యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కిస్తున్నచిత్రం కబాలి. ఈ చిత్రాన్ని కలై ఫులి ఎస్ థాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే నటించారు. అటు అభిమానులు - ఇటు ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కబాలి చిత్రం టీజర్ ను మే 1 ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు డైరెక్టర్ రంజిత్ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ...కబాలి కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ కబాలి సినిమా పై అంచనాలను పెంచేస్తుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన కబాలి ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని మలేషియాలో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కబాలి చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments