'కబాలి' టీజర్ డేట్...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం కబాలి`. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. రాధికా అప్టే, ధన్సిక నటిస్తున్న ఈ చిత్రం ఓ మాఫియా డాన్ కు సంబంధించిన కథ. సినిమాను ఏప్రిల్ లేదా మేలో విడుదల చేద్దామనుకున్నారు అయితే అన్నీ కార్యక్రమాలు పూర్తయినప్పటికీ సినిమా విడుదల మాత్రం అనుకున్న టైంకు చేయలేకపోతున్నారట.
అందుకు కారణం తమిళనాడు ఎన్నికల కారణంగా, ఎన్నికల అనంతరం మే 27న సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే అదే రోజున ధనుష్ సహా మరికొంత సినిమాలు రిలీజ్ కు ఉండటంతో సినిమాను జూన్ 3న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ముందుగా కార్మికులు దినోత్సవం, మే 1న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయడానికి నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com