కబాలి సాంగ్స్ లీక్డ్...

  • IndiaGlitz, [Saturday,June 11 2016]

సూప‌ర్‌స్టార్‌ర‌జనీకాంత్ హీరోగా పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో క‌లైపులి థాను నిర్మించిన చిత్రం క‌బాలి. తెలుగులో ఈ చిత్రాన్ని ష‌ణ్ముక ఫిలింస్ బ్యాన‌ర్‌పై ప్ర‌వీణ్ చౌద‌రి ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు.సినిమా జూలై 1న విడుద‌ల కావాల్సి ఉండ‌గా తాజా వార్త‌ల ప్ర‌కారం జూన్ 15న విడుదల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. సంతోష్ నారాయ‌ణ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో రేపు అంటే జూన్ 12న విడుద‌ల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఆల్బం లీక్ కావ‌డం కోలీవుడ్‌లో పెద్ద దుమారం రేగుతుంది. సినిమా ఆడియో హ‌క్కుల‌ను చేజిక్కించుకున్న థింక్ మ్యూజిక్ వారు ఇప్పుడు లీక్‌డ్ ఆల్బమ్‌ను తొలగించే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఓ ర‌కంగా ఈ లీకేజ్ యూనిట్‌కు పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

More News

జూన్ 17న విడుదలవుతున్న 'కంట్రోల్ సి'

సెకండ్ ఇండిపెండెన్స్ పతాకంపై సాయిరామ్ చల్లా దర్శకత్వంలో తాటిపర్తి ప్రభాకర్ నిర్మించిన సినిమా 'కంట్రోల్ సి'. అశోక్, దిశాపాండే జంటగా నటించారు. ఈ సినిమా జూన్ 17న విడుదలవుతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

చివరి షెడ్యూల్ చిత్రీకరణలో గోపీచంద్ 'ఆక్సిజన్'

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్'.

నాగ్ వెంకటేశ్వరుడు సుమన్ కాదు...

కమర్షియల్ సినిమాల్లోనే కాదు,భక్తిరస ప్రధాన చిత్రాలైన అన్నమయ్య,శ్రీరామదాసు,షిరిడీ సాయి వంటి చిత్రాల్లో కూడా కింగ్ నాగార్జున నటించి మెప్పించాడు.

ధృవ సెకండ్ షెడ్యూల్ పూర్తి...

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా గీతాఆర్ట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ధృవ. తమిళ చిత్రం తనీ ఒరువన్ కు ఇది రీమేక్ గా రూపొందుతోంది.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో సిద్దార్ధ త్రిభాషా చిత్రం

యంగ్ హీరో సిద్దార్ధ నువ్వొస్తానంటే నేనొద్దంటానా,బొమ్మరిలు,ఓయ్...తదితర చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.