క‌బాలి రిలీజ్ డేట్ ఫిక్స్..

  • IndiaGlitz, [Monday,July 04 2016]

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ న‌టించిన లేటెస్ట్ సెన్సేష‌న్ క‌బాలి. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్ట‌ర్ రంజిత్ తెర‌కెక్కించారు. క‌లై ఫులి ఎస్ థాను ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఈ చిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టించింది. అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ కబాలి చిత్రాన్ని ఈనెల 15న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ...కొన్నికార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. అయితే...క‌బాలి ఎప్పుడు రిలీజ్ చేస్తార‌నేది ప్ర‌క‌టించ‌లేదు.

ఇదిలా ఉంటే...క‌బాలి చిత్రం జులై 29న రిలీజ్ అంటూ మ‌లేషియాలో పోస్ట‌ర్స్ ద‌ర్శ‌న‌మిచ్చాయి. దీంతో క‌బాలి జులై 29న రిలీజ్ కావ‌డం ఖాయం అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌లేషియాలో ద‌ర్శ‌న‌మిచ్చిన పోస్ట‌ర్స్ ను రజ‌నీకాంత్ పి.ఆర్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేయ‌డంతో క‌బాలి ఈనెల 29న రావ‌డం ఖాయం అంటూ అభిమానులు ఎంతో ఆస‌క్తి ఎదురుచూస్తున్నారు. త్వ‌ర‌లోనే క‌బాలి నిర్మాత క‌లై ఫులి థాను రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.