ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కబాలి ఓ కొత్త రికార్డ్.

  • IndiaGlitz, [Saturday,May 28 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రంలో రజ‌నీకాంత్ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టించింది. క‌బాలి టీజ‌ర్ ఊహించ‌ని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌బాలి టీజ‌ర్ కి 20 మిలియ‌న్ వ్యూస్ అంటే రెండు కోట్ల మంది ఈ టీజ‌ర్ ను చూసారు.
ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా టీజ‌ర్ కి 20 మిలియ‌న్ వ్యూస్ రాలేదు. ఈవిధంగా ఇండియ‌న్ ఫిల్మ్ హిస్ట‌రీలో టీజ‌ర్ తో 20 మిలియ‌న్ వ్యూస్ సాధించిన తొలి చిత్రంగా క‌బాలి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ విష‌యాన్ని క‌బాలి చిత్ర నిర్మాత క‌లై ఫులి ఎస్ థాను ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. టీజ‌ర్ సెన్సేష‌న్ తో క‌బాలి మూవీ పై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. అటు అభిమానులు, ఇటు ఇండ‌స్ట్రీ ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న క‌బాలి చిత్రాన్ని జులై 1న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రి... టీజ‌ర్ తోనే క‌బాలి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తే...ఇక సినిమాతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.