'కబాలి' నిర్మాతల కేసు....
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను సమర్పణలో షణ్ముక ఫిలింస్ బ్యానర్‌పై కె.పి.చౌదరి, కె.ప్రవీణ్‌కుమార్ వర్మ నిర్మాతలుగా రూపొందిన `కబాలి` చిత్రం జూలై 22న విడుదలకానుంది. మలేషియా బ్యాక్‌డ్రాప్‌లో డాన్‌గా రజనీకాంత్ తెరపై సందడి చేయనున్నారు. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యు.ఎస్‌లో 400 థియేటర్స్‌లో సినిమా విడుదలవుతుంది. అయితే సినిమా విడుదల తర్వాత పైరసీ భూతంతో సినిమా దెబ్బ తినే అవకాశం ఉండటంతో కబాలి నిర్మాతలు మద్రాసు హైకోర్టులో పైరసీ సంబంధిత ప్రొవైడర్స్, వెబ్ సైట్స్‌పై చర్యలు తీసుకోవాలని కేసు వేశారు. మరి మద్రాసు హైకోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout