క‌బాలి కొత్త రికార్డ్..

  • IndiaGlitz, [Monday,May 23 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రంలో రజ‌నీకాంత్ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టించింది. ఇటీవ‌ల రిలీజైన క‌బాలి టీజ‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.దీంతో క‌బాలి టీజ‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింది. ర‌జ‌నీకాంత్ కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని క‌బాలి చిత్రాన్ని అనేక భాష‌ల్లో డ‌బ్ చేస్తున్నారు.

ఇక అస‌లు విష‌యం ఏమిటంటే...మ‌లేషియాలో త‌మిళ చిత్రాలను బాగా ఆద‌రిస్తారు. దీంతో క‌బాలి చిత్రాన్ని కూడా మ‌ల‌య్ (మ‌లేషియా భాష‌) లోకి డ‌బ్ చేస్తున్నారు. దీంతో మ‌ల‌య్ భాష‌లోకి అనువ‌దించిన తొలి త‌మిళ చిత్రంగా క‌బాలి కొత్త రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని మ‌లేషియా మీడియా కంపెనీ మాలిక్ స్ట్రీమ్ ప్రొడ‌క్ష‌న్స్ మ‌లేషియాలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తుంది. రిలీజ్ కి ముందే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న క‌బాలి రిలీజ్ త‌ర్వాత ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో...