తొలిరోజు నుండే 'కబాలి' రికార్డుల పర్వం షురూ....
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, పా రంజిత్ కాంబినేషన్‌లో విడుదలైన కబాలి విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేసింది. జూలై 22న విడుదలైన ఈ చిత్రం విడుదల రోజు నుండే కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది.
ఇండియాతో పాటు తెలుగు, తమిళం, హిందీ మలై భాషల్లో సహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజునే 47కోట్లకు పైగా షేర్ సాధించి, తొలిరోజున అత్యధిక వసూళ్ళను సాధించిన భారతీయ చిత్రంగా కొత్త రికార్డును క్రియేట్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలరోజున 9కోట్ల 70 లక్షలు వసూళ్ళను సాధించి, అనువాద చిత్రాల్లో అత్యధిక వసూళ్ళను సాధించిన చిత్రంగా నిలిచింది. తొలి మూడునాళ్ళలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 22కోట్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యు.ఎస్‌లో అయితే తొలిరోజునే ప్రీమియర్ షోలతో కలిపి రెండున్నర మిలియన్ డాలర్స్ మార్కుని దాటడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments