కబాలి ఫీవర్ నుంచి బయటపడని శిరీష్..
Send us your feedback to audioarticles@vaarta.com
గౌరవం సినిమాతో హీరోగా పరిచయమై...కొత్త జంట సినిమాతో ఓకే అనిపించుకున్న అల్లు శిరీష్ తాజాగా శ్రీరస్తు శుభమస్తు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నెల 5న శ్రీరస్తు - శుభమస్తు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు శిరీష్ మాట్లాడుతూ... బాధ్యత, ఓపిక, మంచి పని ఎవరు చేసినా ప్రొత్సహించడం..ఈ మూడు విషయాలను చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను అని చెప్పాడు.
బాగానే ఉంది కానీ...లావణ్య గురించి చెబుతూ...కబాలి సినిమా డైలాగ్ వలే లావణ్య మామూలు హీరోయిన్ అనుకుంటున్నారా లా..వ..ణ్య...అంటూ కబాలి డైలాగ్ కి పేరేడిలా చెప్పడం చూస్తుంటే కబాలి ఫీవర్ నుంచి అల్లు శిరీష్ ఇంకా బయటపడలేదు అనిపిస్తుంది. ఏది ఏమైనా....పక్కన మెగాస్టార్ పెట్టుకుని ఇలా...అల్లరి చిల్లరగా మాట్లాడడం ఏం బాగోలేదు అంటున్నారు కొంత మంది అభిమానులు. ఇకనైనా శిరీష్ స్టేజ్ పై మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే మంచిది..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com