'క‌బాలి' ఆడియో విడుద‌ల‌

  • IndiaGlitz, [Monday,June 27 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా క‌లైపులి థాను స‌మ‌ర్ప‌ణ‌లో ష‌ణ్ముక ఫిలింస్ బ్యాన‌ర్‌పై పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో కె.పి.చౌద‌రి, కె.ప్ర‌వీణ్‌కుమార్ వ‌ర్మ నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం క‌బాలి. సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సినిమా ఆడియో సీడీల‌ను హీరో వ‌రుణ్‌తేజ్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ను హీరో నాని, బ్యాన‌ర్‌లోగోను టి.సుబ్బిరామిరెడ్డి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

వ‌రుణ్‌తేజ్ మాట్లాడుతూ ''పెద్ద‌నాన్న‌గారికి, ర‌జ‌నీకాంత్‌గారికి మంచి స్నేహం ఉండేది. స్విజ్జ‌ర్లాండ్‌లో ఇంద్ర షూటింగ్ చేస్తున్న స‌మయంలో నేను అక్క‌డ‌కు వెళితే అక్క‌డే ర‌జ‌నీకాంత్‌గారి బాబా షూటింగ్ జ‌రుగుతుంది. అప్పుడే ఆయ‌న్ను క‌లిసి మాట్లాడాను. ఆయ‌నెంతో సాధార‌ణంగా ఉంటారో నాకు అప్పుడు అర్థ‌మైంది. ఆయ‌న భాషా త‌ర్వాత అటువంటి పాత్ర‌లో మ‌రే సినిమా చేయ‌లేదు. ఇప్పుడు ఆ త‌ర‌హాలో క‌బాలిగా మ‌న ముందుకు రానున్నారు. ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను'' అన్నారు.

హీరో నాని మాట్లాడుతూ ''నాకు డైరెక్ట‌ర్ శంక‌ర్‌గారంటే చాలా ఇష్టం. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న రోబో2 కంటే క‌బాలి కోసం నేను ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే ర‌జ‌నీకాంత్‌గారిని రోబోగా కంటే భాషాగా చూడాల‌ని ఇష్ట‌ప‌డుతున్నాను. నేను ఆయ‌న‌కు అభిమానిగా ఆయ‌న్ను ఇమిటేట్ చేయాల‌ని చాలా సార్లు ప్ర‌య‌త్నించాను. ఆయ‌న స్ట‌యిల్ అంటే ఇష్ట‌ప‌డ‌నివారుండ‌రు'' అన్నారు.

టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ ''నాకు ర‌జ‌నీకాంత్ చాలా ఆత్మీయ మిత్రుడు. గొప్ప న‌టుడు. నేను నిర్మించిన హిందీ రీమేక్ జీవ‌న‌పోరాటంలో అమితాబ్‌గారి పాత్ర‌లో న‌టించారు. భార‌తీయ చ‌ల‌న‌చిత్ర సీమ‌కు దొరికిన కోహినూర్ వ‌జ్రం ఆయ‌న‌. ఆయ‌న న‌టించిన క‌బాలి గ్యారంటీగా పెద్ద హిట్ అవుతుంది'' అన్నారు.

ప‌రుచూరి గోపాల‌కృష్ణ మాట్లాడుతూ ''ప్ర‌పంచంలోని వ్య‌క్తిత్వాన్నంతా ఒక‌వైపు, ర‌జ‌నీకాంత్‌గారిని మ‌రోవైపు వేస్తే ర‌జ‌నీకాంత్‌గారే కాస్తా ఎక్కువ‌గా తూగుతారు అటువంటి గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న వ్య‌క్తి ర‌జ‌నీకాంత్‌గారు. ఆయ‌న మ‌మ్మ‌ల్ని భాషా సినిమాకు రైట‌ర్స్‌గా వ‌ర్క్ చేయ‌మ‌ని అడిగితే లిప్ సింక్‌గా డైలాగ్స్ రాయ‌డం తెలియ‌దు సార్ అని అయ‌న‌తో ప‌నిచేయ‌లేక‌పోయాం'' అన్నారు.

ద‌ర్శ‌కుడు పా రంజిత్ మాట్లాడుతూ ''సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఆ అంచ‌నాల‌ను నేను పూర్తి చేశాన‌ని అనుకుంటున్నాను. సినిమా విడుద‌ల కోసం నేను కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను'' అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ సంతోష్ నారాయ‌ణ్ మాట్లాడుతూ '' తెలుగులో సినిమాకు వ‌స్తున్న రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉంది. తెలుగులో కూడా సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను'' అన్నారు.

నిర్మాత కె.పి.ప్రవీణ్‌కుమార్ వ‌ర్మ మాట్లాడుతూ ''నేను డిస్ట్రిబ్యూష‌న్ స్టార్ట్ చేసిన‌ప్పుడు నా మిత్రుడు కె.పి.చౌద‌రి స‌ల‌హాతో క‌బాలి సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నాం.

కె.పి.చౌదరి మాట్లాడుతూ ''మోహ‌న్‌బాబుగారు, అల్లు అర‌వింద్‌గారు క‌లైపులిథానుగారికి ఫోన్ చేసి ఎంతో స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌'' అన్నారు.

ర‌జ‌నీకాంత్‌, రాధికా ఆప్టే, ధన్సిక‌, కిశోర్‌, జాన్ విజ‌య్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు కెమెరా: ముర‌ళీ, సంగీతం: స‌ంతోష్ నారాయ‌ణ్‌, ఆర్ట్: రామ‌లింగం, ఫైట్స్: అన్బ‌రివు, మాటలు: సాహితి, పాట‌లు: రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, వనమాలి. మేక‌ప్‌: భాను, ఎఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: 'దేవి-శ్రీదేవి' స‌తీష్‌, సమర్పణ: కలైపులి థాను, నిర్మాతలు: కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్,దర్శకత్వం: పా రంజిత్.

More News

'నీ జ‌త‌లేక‌' ఆడియో విడుద‌ల‌

నాగ‌శౌర్య‌, పారుల్‌  హీరో హీరోయిన్లుగా ఓగిరాల వేమూరి నాగేశ్వ‌ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీ స‌త్య విదుర మూవీస్ బ్యాన‌ర్‌పై  రూపొందుతోన్న చిత్రం `నీ..జ‌త‌లేక‌`. లారెన్స్ దాస‌రి ద‌ర్శ‌క‌త్వంలో జి.వి.చౌద‌రి, నాగరాజుగౌడ్‌ చిర్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. స్వ‌రాజ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్

విడుదల సన్నాహాల్లో '21st సెంచరీ లవ్'

బీ.ఆర్.ఎస్.ఐ పతాకంపై గోపీనాధ్ ను హీరోగా పరిచయం చేస్తూ పోల్కంపల్లి నరేందర్ నిర్మిస్తున్న సందేశాత్మక ప్రేమకథా చిత్రం "ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్".

జూలై 2న 'నిర్మల కాన్వెంట్‌' డిజిటల్‌ ట్రైలర్‌ రిలీజ్‌

కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'నిర్మల కాన్వెంట్‌'. ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు.

జూలై 7న విడుదలవుతున్న 'పనిలేని పులిరాజు'

ధన్ రాజ్ పదమూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పనిలేని పులిరాజు’. పాలేపు మీడియా ప్రై.లి. పతాకంపై చాచా దర్శకత్వంలో పి.వి.నాగేష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ చిత్రం జూలై 7న విడుదలవుతుంది.

'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' పాటల విడుదల

మోడరన్‌ సినిమా పతాకంపై ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో విజయ్‌వర్మ పాకలపాటి సహ నిర్మాతగా యూత్‌ఫుల్‌ హర్రర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న చిత్రం 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'.