కబాలి ఆడియో రిలీజ్ డేట్..

  • IndiaGlitz, [Thursday,June 02 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించారు. క‌లై ఫులి థాను ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టించింది. సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందించిన క‌బాలి ఆడియోను ఈ నెల 10లోపు రిలీజ్ చేయ‌నున్న‌ట్టు గ‌తంలో ప్ర‌క‌టించారు.
అయితే...ఆడియో వేడుక ఎక్క‌డ చేయాల‌నే విష‌యం పై ఇంకా క్లారిటీ రాలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ నెల 15న ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మాన్ని గ్రాండ్ గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఒక‌టి రెండు రోజుల్లోనే ఆడియో రిలీజ్ డేట్ అధికారికంగా ఎనౌన్స్ చేయ‌నున్నారు. కేవ‌లం ఐదు రోజుల్లోనే ర‌జ‌నీకాంత్ త‌న డ‌బ్బింగ్ పూర్తి చేసారు. తెలుగులో ర‌జ‌నీకాంత్ కు మ‌నో డ‌బ్బింగ్ చెబుతున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న క‌బాలి చిత్రాన్ని జులై 1న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.