నేడే కాశి ప్రీ రిలీజ్ ఈవెంట్

  • IndiaGlitz, [Monday,May 14 2018]

ఆల్ రౌండర్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎక్జాంపుల్ విజయ్ ఆంథోని. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకొంటూ.. నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొన్న విజయ్ ఆంటోనీ ఇటు తెలుగు ,అటు తమిళ బాషల్లో తనకంటూ ఓ ప్రత్యేక మార్కెట్ ను కూడా సాధించుకున్నాడు. ఈ టాలెంటెడ్ హీరొ నటించిన తాజా చిత్రం కాశి.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఆడియోన్స్ ను ఆకట్టుకొని మిలియన్ వ్యూస్ ను సాధించింది.అంజలి, సునైన కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లెజండ్ సినిమా పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపాటి తెలుగులో విడుదల చేయనున్నారు. భారీ పోటీ నడుమ అత్యధిక మొత్తం చెల్లించి ఈ చిత్రాన్ని దక్కించుకొన్నారు.

తెలుగు-తమిళ భాషల్లో మే 18న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతొంది. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. విజయ్ ఆంథోనీ ప్రతి చిత్రంలో మాటలు ఓ హైలెట్ గా నిలుస్తాయి. ఈ చిత్రానికి సైతం భాష్య శ్రీ సమకూర్చిన సాంగ్స్ , డైలాగ్స్ ది బెస్ట్ గా ఉంటాయని నిర్మాతలు తెలిపారు. కాగా ఈ రోజు సాయంత్రం కాశి ప్రీ రిలీజ్ ఈవెంట్ దసపల్లా లొ అంగరంగ వైభవంగా జరుగనుంది.

విజయ్ ఆంటోనీ, అంజలి, సునైన, అమృత అయ్యర్, శిల్పా మంజునాథ్, రాకేష్ పృధ్వీ, గాల్విన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోనీ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్, మాటలు: భాష్య శ్రీ ఎడిటర్: లారెన్స్ కిషోర్, నిర్మాతలు: ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపాటి, రచన-దర్శకత్వం: కిరుతిగ ఉదయనిధి.

More News

'స‌వ్య‌సాచి' యు.ఎస్‌. షెడ్యూల్ పూర్తి

నాగ చైతన్య, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'సవ్యసాచి'. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

నాలుగోసారి అదే హీరోయిన్‌తో బాల‌య్య‌...

నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు త‌న తండ్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ య‌న్‌.టి.ఆర్ విష‌యంలో కాస్త స‌మ‌యం తీసుకుంటున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

రికార్డ్ ధ‌ర‌కు 'మ‌హాన‌టి' శాటిలైట్ హ‌క్కులు

కీర్తి సురేశ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'మ‌హాన‌టి'.  మే 9న విడుద‌లైన ఈ చిత్రం తిరుగులేని విజ‌యాన్ని ద‌క్కించుకుంది. తెలుగు, త‌మిళంలో స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో రికార్డ్ క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తుంది.

ఎన్టీఆర్‌తో మ‌రో సినిమా ప్లాన్ చేస్తున్న ద‌త్‌

ఒక‌ప్పుడు సీనియ‌ర్ ఎన్టీఆర్‌, చిరంజీవి వంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన నిర్మాత సి.అశ్వ‌నీద‌త్‌. ఇప్పుడు ద‌త్ కుమార్తెలు ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్న ద‌త్‌లు నిర్మాత‌లుగా మారారు.

స‌న్నిని చూడాలంటే డబ్బు ఇవ్వాల్సిందే...

స‌న్నీలియోన్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ పోర్న్‌స్టార్ బాలీవుడ్ స‌హా ద‌క్షిణాదిన కూడా సినిమాలు చేస్తుంది. ప్ర‌స్తుతం ద‌క్షిణాదిన 'వీర‌మ‌హాదేవి' అనే సినిమా చేస్తుంది.