అడ్వెంచ‌ర్, మ్యాజిక్, హ‌ర్ర‌ర్, కామెడీ క‌లిపి రూపొందించిన డిఫ‌రెంట్ మూవీ కాష్మోరా - కార్తీ

  • IndiaGlitz, [Saturday,October 08 2016]

త‌మిళ హీరో కార్తీ, న‌య‌న‌తార‌, శ్రీదివ్య హీరో, హీరోయిన్లుగా గోకుల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ చిత్రం కాష్మోరా. ఈ చిత్రాన్ని పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందించిన కాష్మోరా ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మాధ‌వ‌న్ ముఖ్య అతిథిగా హాజ‌రై కాష్మోరా ట్రైల‌ర్ & ఆడియో బిగ్ సీడీను రిలీజ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా హీరో మాధ‌వ‌న్ మాట్లాడుతూ...కాష్మోరా ట్రైల‌ర్ ఈరోజు ఉద‌యం చూసాను. నాకు బాగా న‌చ్చ‌డంతో ఈ మూవీకి ప‌బ్లిసిటీ చేయాలి అనిపించింది. రెండున్న‌ర సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డి ఈ సినిమాని రూపొందించారు అంటే మామూలు విష‌యం కాదు. హీరో, ప్రొడ్యూస‌ర్, డైరెక్ట‌ర్...ఇలా అంద‌రూ క‌లిసి ఓ మంచి ప్రాజెక్ట్ అందించాలి అనే ఇంట్ర‌స్ట్ తో ఈ సినిమా చేసారు. సాధార‌ణంగా షూటింగ్ ప్రారంభం అయిన‌ప్పుడే పేక‌ప్ ఆరు గంట‌ల‌కా, ఏడు గంట‌ల‌కా అని అడుగుతాం. కానీ...ఇలాంటి సినిమాల‌కు వ‌ర్క్ చేస్తున్న‌ప్పుడు అలా అడ‌గం. డే & నైట్ వ‌ర్క్ చేయాలి అనిపిస్తుంటుంది. కాష్మోరా పోస్ట‌ర్ చూసి కార్తీ అంటే అస‌లు న‌మ్మ‌లేదు. కార్తీ ఫేస్ లో ఉండే న‌వ్వును చూసి కార్తీ అని గుర్తుప‌ట్టాను. సినిమా కోసం కార్తీ చాలా క‌ష్ట‌ప‌డుతుంటాడు. పి.వి.పి గారు మంచి సినిమాలు అందిస్తుంటారు. డైరెక్ట‌ర్ గోకుల్ కి ముందుగానే కంగ్రాట్స్ తెలియ‌చేస్తున్నాను. కార్తీ - గోకుల్ క‌లిసి ఈ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా, గ‌ర్వంగా ఉంది అన్నారు.

హీరో కార్తీ మాట్లాడుతూ...ఈ ఆడియో ఫంక్ష‌న్ కి మా అన్న‌య్య రాలేదు. కానీ....మా అన్న‌య్య‌కి క్లోజ్ ఫ్రెండ్ అయిన మాధ‌వ‌న్ రావ‌డం చాలా సంతోషంగా ఉంది. డైరెక్ట‌ర్ గోకుల్...ఈ సినిమా క‌థ ఫుల్ గా చెప్ప‌లేదు. కాష్మోరా క్యారెక్ట‌ర్ సీన్స్ న‌టించి చూపించారు. ఆత‌ర్వాత ఇంకో క్యారెక్ట‌ర్ గురించి చెప్పారు. ఈ రెండు క్యారెక్ట‌ర్స్ గురించి విన్న త‌ర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇందులో అడ్వెంచ‌ర్, మ్యాజిక్, హ‌ర్ర‌ర్, కామెడీ...ఇలా అన్ని అంశాలు ఉన్నాయి. అందుచేత కాష్మోరా అంద‌రికీ న‌చ్చుతుంది అని నా న‌మ్మ‌కం. ఇలాంటి పెద్ద సినిమా తీయాలంటే ఈజీ కాదు.యుగాంతం సినిమా చేయ‌డానికి 3 సంవ‌త్స‌రాలు పట్టింది. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయ‌మ‌ని నా త‌మ్ముడు ప్ర‌భుని అడిగాను. వెంట‌నే ఓకే చేస్తాను అన్నాడు. ధైర్యం చేసి ఈ సినిమాని నిర్మించిన ప్ర‌భుకి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను.

ఈ సినిమా మ‌ధ్య‌లో ఉండ‌గా బాహుబ‌లి వ‌చ్చింది. మాకు బాహుబ‌లి ఒక డైనోస‌ర‌లా అనిపించింది. మా ద‌గ్గ‌ర అంత బ‌డ్జెట్ లేదు ఏం చేయాలి అనుకున్నాను. కానీ..ప్ర‌భు భారీ సెట్స్ తో ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఒక‌రోజు సెట్ లోకి రాగానే ఇంత పెద్ద సెట్టా..ఇది మా సినిమానేనా అనిపించింది. మాకు ఇది బిగ్ ఛాలెంజ్. ఎంతో మంది సీనియ‌ర్ టెక్నీషియ‌న్స్ ఈ మూవీకి వ‌ర్క్ చేసారు. మంచి ట్యూన్స్ అందించిన సంతోష్ నారాయ‌ణ్ కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. అలాగే మ‌మ్మ‌ల్ని ఎంత‌గానో ఇన్ స్పైయిర్ చేసిన రాజ‌మౌళి గార్కి థ్యాంక్స్.ఈ మూవీకి మేజ‌ర్ ప్ల‌స్ ఏమిటంటే...హ్యామ‌ర్. అయితే ఇందులో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉన్నారు కానీ...రొమాన్స్ లేదు. పిల్ల‌ల‌కు బాగా న‌చ్చే సినిమా ఇది అన్నారు.

హీరోయిన్ శ్రీదివ్య మాట్లాడుతూ....ట్రైల‌ర్ & సాంగ్స్ ఎంత బాగున్నాయో అంత‌కు మించి సినిమా ఉంటుంది. ఈ సినిమాలో న‌టించిన నాకే థ్రిల్లింగ్ గా అనిపించింది. మంచి సినిమాలో న‌టించే అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ గోకుల్, హీరో కార్తీకు ధ్యాంక్స్. నేను ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని క్యారెక్ట‌ర్ ను ఈ చిత్రంలో చేసాను.స‌ఖి చిత్రం చూసిన‌ప్ప‌టి నుంచి మాధ‌వ‌న్ గారంటే చాలా ఇష్టం. ఈ చిత్రం ఆడియో ఫంక్ష‌న్ కి మాధ‌వ‌న్ గారు రావ‌డం చాలా సంతోషంగా ఉంది. స‌క్సెస్ ఫుల్ మూవీస్ అందిస్తున్న పి.వి.పి గార్కి ఈ సినిమా మ‌రో స‌క్సెస్ అందించాలి అని కో్రుకుంటున్నాను అన్నారు.

నిర్మాత పి.వి.పి మాట్లాడుతూ....మా ఆడియో ఫంక్ష‌న్ కి అతిధిగా వ‌చ్చిన మాధ‌వ‌న్ కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. కార్తీ ఈ చిత్రం కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేసాడు. ఆడియోన్స్ కాష్మోరా చిత్రాన్ని చూసి థ్రిల్ ఫీల‌వుతారు. మ‌ల్లెలతీరం సినిమా టైమ్ లో శ్రీదివ్య‌ను క‌లిసాను. మేము తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న కాష్మోరా చిత్రంలో శ్రీదివ్య న‌టించ‌డం ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని దీపావ‌ళి కానుక‌గా ఈనెల 28న రిలీజ్ చేయ‌నున్నాం అన్నారు.

ర‌చ‌యిత శ‌శాంక్ మాట్లాడుతూ...ఈ సినిమా ఆడియోన్స్ ఊహించ‌ని విధంగా ఉంటుంది. హైలెట్స్ చాలా ఉన్నాయి. ఇది సీరియ‌స్ గా ఉండ‌దు. డిఫ‌రెంట్ గా ఉండే ఫ‌న్ ఫిల్మ్ ఇది. ఖ‌చ్చితంగా ఆడియోన్స్ ఎంజాయ్ చేస్తారు. కార్తీ క్యారెక్ట‌ర్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంది. నాకు తెలిసి ఈరోజుల్లో స్ర్కిప్ట్ చ‌దివి మూవీని నిర్మించే నిర్మాత అంటే ప్ర‌భు. పది సంవ‌త్స‌రాల నుంచి ప్ర‌భుతో అనుబంధం ఉంది. అలాగే పి.వి.పి గారి ఫ‌స్ట్ ఫిల్మ్ నుంచి నేను వ‌ర్క్ చేస్తున్నాను. అరుంధ‌తి, మ‌గ‌ధీర త‌ర‌హాలో ఉండే సినిమా కావ‌డంతో త‌మిళ్ కంటే తెలుగులో బాగా ఆద‌ర‌ణ ల‌భిస్తుంది అనుకుంటున్నాను.

ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత ప్ర‌భు, డిఓపి ఓం ప్ర‌కాష్, వంశీ పైడిప‌ల్లి త‌దిత‌రులు పాల్గొన్నారు.