'కాలా' టు బాలా
Send us your feedback to audioarticles@vaarta.com
రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా లెజండరీ డైరెక్టర్ బాపు రూపొందించిన 'రాంబంటు' చిత్రంలో కథానాయికగా నటించి.. బాపు బొమ్మగా పేరు తెచ్చుకున్నారు ఈశ్వరీ రావు. స్వతహాగా తెలుగింటి పడుచు అయిన ఈశ్వరీ రావు.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటిగా రాణించారు.
భద్ర చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన ఈశ్వరీ రావు.. ఆ తరువాత 'లెజెండ్', 'అఆ', 'బ్రహ్మోత్సవం' తదితర చిత్రాల్లో సందడి చేశారు. తాజాగా రజనీకాంత్ నటించిన కాలా చిత్రంలో.. `కాలా` భార్య స్వర్ణ పాత్రలో తన హుషారైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు ఈశ్వరీ రావు.
తెలుగు, తమిళ భాషల్లో ఈమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే.. జాతీయ అవార్డు గ్రహీత బాలా దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం 'వర్మ' లో నటించే ఛాన్స్ కొట్టేశారావిడ. సంచలన విజయం సాధించిన 'అర్జున్ రెడ్డి' కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు ఈశ్వరీ రావు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com